సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యగారి ‘లెనిన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

ABN, Publish Date - Jul 11 , 2026 | 11:25 AM

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ మూవీ ఫస్ట్ కలెక్షన్స్ పోస్టర్‌ని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.

Lenin First Day Collections

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ (Lenin Movie) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (జూలై 10) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. మొదటి ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకెళ్తున్న ఈ చిత్రం, మొదటి రోజు అఖిల్ కెరీర్‌లోనే రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ మేరకు మేకర్స్ ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ వివరాలతో అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు.


ఈ పోస్టర్ ప్రకారం.. ‘లెనిన్’ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూళ్లను (Lenin First Day Collections) సాధించింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. మొదటి రోజు కలెక్షన్ల వర్షం కురిసింది. వీకెండ్ కావడం, పాజిటివ్ టాక్ తోడవ్వడంతో శని, ఆదివారాల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి అఖిల్‌ హిట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా.. ఇప్పటి వరకు అయ్యగారికి సాలిడ్ హిట్ అనేది పడలేదు. ప్రతి సినిమాకు ముందు ఈసారి పక్కా అనేలా వార్తలే కానీ, హిట్ మాత్రం ఆయన దరి చేరలేదు. అందుకే ‘లెనిన్’ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో.. అఖిల్ ఖాతా మొదటి హిట్ పడినట్లేనని అభిమానులంతా భావిస్తున్నారు. చూద్దాం.. ‘లెనిన్’ భవిష్యత్ ఎలా ఉంటుందో..


అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ నయా లుక్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌కు థియేటర్లలో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారనే విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Love oh Love Review: ‘లవ్‌ ఓ లవ్‌’ మూవీ రివ్యూ

గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్

మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్!

Updated Date - Jul 11 , 2026 | 11:25 AM