గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:31 PM
టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ మధ్య ఇప్పుడు వార్ జరగబోతోంది. అదేంటి అనుకుంటున్నారా? నిజంగా వారేం యుద్ధం చేసుకోవడం లేదులే కానీ, వారు చేయబోతోన్న చిత్రాల విషయంలో మాత్రం ఇప్పుడు వార్ స్టార్ట్ అయినట్లుగానే భావించాలి.
టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) మధ్య ఇప్పుడు వార్ జరగబోతోంది. అదేంటి అనుకుంటున్నారా? నిజంగా వారేం యుద్ధం చేసుకోవడం లేదులే కానీ, వారు చేయబోతోన్న చిత్రాల విషయంలో మాత్రం ఇప్పుడు వార్ స్టార్ట్ అయినట్లుగానే భావించాలి. రీసెంట్‌గా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ఓ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా దైవిక నేపథ్యంతో ఉంటుందని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌తో యుద్ధానికి అధిపతి, దేవతల సైన్యాధిపతి అయిన కార్తికేయుని కథ ఇదని క్లారిటీ కూడా వచ్చేసింది.
తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా ఓ మూవీని ప్రకటించారు. ‘తమిళ మురుగన్’ (Thamizh Murugan) పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్ర గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. కార్తికేయుడిని మురుగన్ అని కూడా పిలుస్తారనే విషయం తెలియంది కాదు. ఈ సినిమా కూడా దైవిక నేపథ్యంలోనే ఉంటుందనేది ఈ గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ అనేలా టాక్ మొదలైంది. ధనుష్-వెట్రిమారన్ నుంచి వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా త్రివిక్రమ్ అండ్ యూనిట్ షాక్‌కు గురై ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఎవరూ ఊహించని ప్రకటన ఇది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ లేదు. ఈ మూవీ పూర్తి చేసి, త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ధనుష్‌తో వెట్రిమారన్ ‘తమిళ మురుగన్’ చిత్రాన్ని పూర్తి చేసినా చేసేయవచ్చు. ఎందుకంటే, వెట్రిమారన్ మేకింగ్ అంత స్పీడ్‌గా ఉంటుంది. ఒక్కసారి సెట్స్‌పైకి సినిమాను తీసుకెళ్లాడంటే, పూర్తయ్యే వరకు వెట్రిమారన్ వదలడు. అదే జరిగితే మాత్రం త్రివిక్రమ్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.. లేదంటే, కథలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇద్దరూ తెరకెక్కించేది ‘మురుగన్’ కథనే. రెండు సినిమాల అనౌన్స్‌మెంట్స్‌ని గమనిస్తే.. కథ కూడా దాదాపు సేమ్ ఉంటుందని అనిపిస్తోంది.
అలాగే ధనుష్ కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడే. వెట్రిమారన్ సినిమా ముందు విడుదలైతే.. త్రివిక్రమ్ చేసే సినిమాకు అంత బజ్ ఉండకపోవచ్చు. కాబట్టి.. ఎలా చూసినా త్రివిక్రమ్‌కు వెట్రిమారన్ పోటీగానే ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అన్నట్లు.. కోలీవుడ్‌లో పోటీ పడుతున్న బక్కోళ్లు అనిరుధ్, సాయి అభ్యంకర్ మధ్య కూడా ఈ వార్ ఉండబోతోంది. త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. వెట్రిమారన్ చిత్రానికి సాయి అభ్యంకర్ ఫిక్స్ అయ్యారు. మొత్తంగా చూస్తే ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War).. ఇపుడు కోలీవుడ్, టాలీవుడ్ మధ్య వార్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్!
Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్
2026: జనవరి టు జూలై.. కర్ణాటకలో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాలివే..