సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

KS Chitra: ఆప్యాయంగా పిలిచే అమ్మ పిలుపు కరువైంది..

ABN, Publish Date - Jul 14 , 2026 | 10:39 AM

దక్షిణాది గాన కోకిల ఎస్‌ జానకి (S Janaki) అనారోగ్యంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే! తాజాగా సింగర్‌ చిత్ర (KS Chitra) సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగా పోస్ట్‌ చేశారు.

దక్షిణాది గాన కోకిల ఎస్‌ జానకి (S Janaki) అనారోగ్యంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే! ఆదివారం సాయంత్రంకర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంచనాలతో మైసూరులో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జానకి మనవరాల అప్సర విద్యుల (Apsara) ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జానకమ్మను చివరిసారి చూసేందుకు అభిమానులు వేలాది సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. సంగీత రంగం నుంచి గాయనీగాయకులు మనో, విజయ్‌ ప్రకాశ్‌, కె.ఎస్‌ చిత్ర, సుజాతా మోహన్‌, శ్వేతా మోహన్‌ తెలుగు పరిశ్రమ నుంచి సునీత తదితరులు హాజరయ్యారు. జానకమ్మకు నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యారు.

తాజాగా సింగర్‌ చిత్ర (KS Chitra) సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగా పోస్ట్‌ చేశారు. ‘జానకమ్మ నాకు స్ఫూర్తి. ఒకరకంగా నేనీ రంగంలో స్థిరపడటానికి ఆమె ఇచ్చిన ప్రోద్బలమే కారణం. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అమ్మ అంత్యక్రియలు తర్వాత మైసూరు నుంచి ఇంటికి వచ్చినా ఇక అమ్మ నాతో ఉండదనే నిజాన్ని నమ్మలేకపోతున్నా. ఆమె లేని లోటు మాటల్లో చెప్పడం అసాధ్యం. ప్రేమగా పలకరిస్తూ ఆమె నుంచి తరచూ వచ్చే ఫోన్‌ కాల్స్‌ ఇకరావు. అమ్మను మిస్‌ అవుతున్నాను అనే మాట చాలా చిన్నది అవుతుంది. కేవలం అమ్మ జ్ఞాపకాలు, పాటలు మాత్రమే నాతో ఉంటాయి. అమ్మా.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి’ అని భావోద్వేగంగా పోస్ట్‌ చేశారు. చిత్ర ట్వీట్‌ చూసి అభిమానులు చలించిపోతున్నారు.

ALSO READ:

Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్

Mysskin: విజయ్‌ సేతుపతి ఒక అగ్నిపర్వతం 

Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది

Indian Movies: ఆ చిత్రాల్లో అగ్రస్థానంలో 'టాక్సిక్‌'!

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ

Updated Date - Jul 14 , 2026 | 12:16 PM