Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది

ABN , Publish Date - Jul 14 , 2026 | 09:45 AM

విశ్వ నాయకుడు కమల్ హాసన్ గారాలపట్టి, కథానాయిక శ్రుతి హాసన్ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. తాజాగా చెన్నైలో  కొనుగోలు చేసిన ఇంట్లోకి  గృహప్రవేశం మయ్యారు.

Shruti Haasan

విశ్వ నాయకుడు కమల్ హాసన్ గారాలపట్టి, కథానాయిక శ్రుతి హాసన్ (Shruti Haasan) కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. తాజాగా చెన్నైలో కొనుగోలు చేసిన ఇంట్లోకి  (House warming) గృహప్రవేశం మయ్యారు. అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. దీనికి సంబందించిన ఫొటోలను శ్రుతి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. గృహప్రవేశ పూజ సందర్భంగా శ్రుతి సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపించారు. పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొంటూ, కొత్త ఇంటి తాళాలు, ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రసాదాలు, పూజా ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.  అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శ్రుతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

శ్రుతికి ఇప్పటికే ముంబైలో ఓ సొంత నివాసం ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నైలో కూడా కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకున్నట్లు కోలీవుడ్ చెబుతోంది. అయితే ఈ వేడుకలో శృతి హాసన్ తండ్రి కమలహాసన్, తల్లి సారిక, చెల్లి అక్షర హాసన్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది 

ఇక సినిమాల విషయానికి వస్తే... ఇటీవల 'పెద్ది' చిత్రంలోని ప్రత్యేక గీతంతో ప్రేక్షకులను అలరించిన శ్రుతి హాసన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలో 'ఆకాశంలో ఒక తార', 'ట్రైన్' చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

ALSO READ:

ఒక బిలియన్ డాలర్లు.. బాక్సాఫీస్ వద్ద ‘మైఖేల్’ సరికొత్త చరిత్ర

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్

రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ

Updated Date - Jul 14 , 2026 | 09:53 AM