Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్

ABN , Publish Date - Jul 14 , 2026 | 09:07 AM

హీరో ధనుష్‌ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘అమరన్‌’ ఫేం రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ‘ఓం’ చిత్రంలో నటిస్తున్నారు.


హీరో ధనుష్‌ (Dhanush) వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘అమరన్‌’ ఫేం రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ‘ఓం’ (Om Movie) చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘తమిళ మురుగన్‌’ చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా ‘డి-56’ చిత్రంపై దర్శకుడు తమిళరసన్‌ పచ్చముత్తు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ నెల 28న ధనుష్‌ జన్మదినం సందర్భంగా అదే రోజు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ విషయంపై దర్శకుడు స్పందిస్తూ, ‘డి-56’కు ఆర్ట్‌ డైరెక్టర్‌గా వీరమణి గణేషన్‌ను ఎంపిక చేశాం. ‘డి-55’ తర్వాతే ఈ చిత్రం వస్తుంది. ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంతకుమించి వివరాలను వెల్లడించలేనన్నారు. కాగా, ఈ మూడు ప్రాజెక్టుల తర్వాత మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధనుష్‌ మరోమారు నటించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 

ALSO READ:

ఒక బిలియన్ డాలర్లు.. బాక్సాఫీస్ వద్ద ‘మైఖేల్’ సరికొత్త చరిత్ర

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్

రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ


Updated Date - Jul 14 , 2026 | 09:23 AM