సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ విషయంలో నయనతార సలహా తీసుకున్నా: కృతి శెట్టి

ABN, Publish Date - Apr 09 , 2026 | 09:25 PM

‘నా లైఫ్‌కి సంబంధించిన ఓ విషయంలో నయనతార సలహా తీసుకున్నాన'ని అన్నారు బేబమ్మ కృతి శెట్టి. ఆమె హీరోయిన్‌గా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’.

Krithi Shetty

‘నా లైఫ్‌కి సంబంధించిన ఓ విషయంలో నయనతార (Nayanthara) సలహా తీసుకున్నాన'ని అన్నారు బేబమ్మ కృతి శెట్టి (Krithi Shetty). ఆమె హీరోయిన్‌గా, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా.. విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany). ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఎస్.జె. సూర్య, యోగి బాబు వంటి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కృతి శెట్టి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.


‘‘నేను ‘ఉప్పెన’ తర్వాత పూర్తిస్థాయి లవ్ స్టోరీ చేయలేదు. అలాంటి ఫుల్ లెంత్ ప్రేమ కథ చేసే అవకాశం మళ్లీ ఈ సినిమా ద్వారానే వచ్చింది. ఇందులో ప్రేమకథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి? అని కౌంట్ చేసుకుంటున్నారు. ఇది చాలామంది హార్ట్‌కు దగ్గరగా ఉంటుంది. రియల్‌గా అనిపించే క్యారెక్టర్‌ని సినిమాటిక్‌గా ఇందులో చూపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే, ఈ జనరేషన్‌లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు.. కానీ ఫోన్ లేకుండా ఉండడం చాలా కష్టం. అలాంటి ఒక క్యారెక్టర్ ఇందులో నేను చేశాను. విజువల్ కాన్సెప్ట్ 2040 ఫ్యూచరిస్టిక్‌గా ఉన్నా, కథ మాత్రం అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది.


ఈ సినిమాతో నయనతారతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆమె ఈ సినిమాకు నిర్మాత. ఆమెను సినిమాలలో చూస్తే ఒక బాస్ లేడీలా ఉంటారు, కానీ బయట మాత్రం చాలా స్వీట్ పర్సన్. నయనతార, శివన్ అందరినీ చాలా చక్కగా చూసుకుంటారు. ఒక సమయంలో లైఫ్‌కు సంబంధించిన ఒక అడ్వైస్‌ని నయనతారని అడిగాను. ఆమె చాలా చక్కగా గైడ్ చేశారు. కెరీర్ గురించి కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు..’ అని కృతి శెట్టి తెలిపారు. ఆమె ఈ విషయం చెప్పడంతో ఇటీవల తనకు బ్రేకప్ అయిందనే మాటలకు ఆ విషయాన్ని కనెక్ట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తనకు బ్రేకప్ అయిందని, ఆ విషయం తన మదర్‌కు తెలుసని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి తెలిపారు. ఆ బ్రేకప్ నుంచి కోలుకోవడానికే, నయనతార సలహాలను కృతి శెట్టి తీసుకుని ఉంటుందనేలా అంతా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

కోసి కారం పెడ‌తా.. 'తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ' ట్రైల‌ర్ అదిరింది! తెలుగులో ఇలా కూడా సినిమాలు తీస్తున్నారా

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత వదినపై హీరోయిన్ హన్సిక రూ.2 కోట్ల పరువు నష్టం దావా

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

Updated Date - Apr 10 , 2026 | 02:00 PM