Krithi Shetty: ఉప్పెన భామ.. హిట్ అందుకొనే తరుణం ఎప్పుడో
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:11 PM
అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
krithi shetty: అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన కృతిని చూసి నెక్స్ట్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఈమె అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి అన్నట్లు అమ్మడు ఎంచుకున్న సినిమాలు ఏవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఉప్పెన తప్ప అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు.ఇక తెలుగు వదిలి.. కనీసం తమిళ్ లోనైనా తన లక్ ను ను పరీక్షించాలనుకుంది.
తమిళ్ లో కృతి శెట్టి .. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు చేస్తుంది. కానీ, కృతికి ఒక విచిత్ర సమస్య ఎదురైంది. ఈ మూడు సినిమాలు రిలీజ్ కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ మూడు సినిమాలు ఏంటంటే.. ఒకటి వా వాతీయర్. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నలన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. షూటింగ్ కూడా జరుపుకున్నట్లు మేకర్స్ తెలిపారు. షూటింగ్ కూడా ఫినిష్ అయ్యిందని సమాచారం. కానీ, ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించింది లేదు. ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు.
ఇక కృతి నటించిన రెండో సినిమా లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్నికి నయనతార భర్త విజ్ఞేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ, అదే రోజున ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా కోసం లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వాయిదా పడతుందని సమాచారం.
ఇక ఈ రెండు సినిమాలతో కాకుండా కృతి నటిస్తున్న మరో చిత్రం రవి మోహన్ నటించిన జీనీ. ఈ సినిమా కూడా పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇలా కృతి ఆశలు పెట్టుకున్న మూడు సినిమాలు వాయిదాలలోనే ఉన్నాయి. ఇవేప్పుడు రిలీజ్ కు రెఢీ అవుతాయో.. కృతికి హిట్ అందే తరుణం ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Rashmika Mandanna: అయ్యా.. అమ్మడిని కొట్టేవారు టాలీవుడ్ లోనే లేరా
Zubeen Garg: జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి నివాళి