Krithi Shetty: ఆమెకి గట్టి పోటీ ఇస్తుంది

ABN , First Publish Date - 2023-03-15T13:00:08+05:30 IST

కన్నడ నటీమణులు ఇప్పుడు తెలుగులో బాగా పేరు తెచ్చుకుంటున్నారు. అందులో కృతి శెట్టి కూడా వుంది. మొదటి సినిమా 'ఉప్పెన' తో మంచి పేరు తెచ్చుకొని, ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో డిమాండ్ వున్న నటీమణుల్లో ఒకరుగా వుంది. మిగతా కన్నడ నటీమణులకు గట్టి పోటీగా కూడా వుంది కృతి శెట్టి

Krithi Shetty: ఆమెకి గట్టి పోటీ ఇస్తుంది

కృతి శెట్టి (Krithi Shetty) ఇప్పుడు దక్షిణాదిన బాగా డిమాండ్ వున్న నటీమణుల్లో ఒకరుగా వుంది. 'ఉప్పెన' (Uppena) సినిమాతో ఆరంగేట్రం చేసింది, ఆ సినిమా ఉప్పెన లా ఆమెకి చాలా పెద్ద పేరు తీసుకువచ్చింది. మొదటి సినిమాతో ఏ నటీమణి కి రానంత పేరు వచ్చింది కృతి శెట్టి కి. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె బేబమ్మ గా అంత నటన కనపరచటమే. తరువాత ఒకటి రెండు సినిమాలు సరిగా నడవకపోయినా, కృతి శెట్టి ఇప్పుడు మెల్ల మెల్లగా దక్షిణాదిలో ఒక డిమాండ్ వున్న నటిగా తయారయింది.

krithishetty2.jpg

ఆమె రాబోతున్న సినిమా 'కస్టడీ' (Custody) నాగ చైతన్య (Naga Chaitanya) పక్కన చేస్తోంది. దీనికి వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకుడు, కాగా ఈ సినిమా తెలుగు, తమిళ్ తో పాటు మిగతా భాషల్లో కూడా విడుదల అవుతోంది. ఇందులో కృతి శెట్టి కి మంచి నటన కనబరిచే పాత్ర చేస్తున్నట్టు ఈ సినిమా పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది.

అలాగే మలయాళం లో మంచి పేరున్న నటుడు టోవినో థామస్ (Tovino Thomas). అతని పక్కన ఒక మలయాళం సినిమా చేస్తోంది కృతి శెట్టి. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో విడుదుల అవుతోంది. ఇవి కాకుండా ఇంకా తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు చేస్తోంది కృతి శెట్టి.

krithishetty.jpg

బెంగుళూరు కి చెందిన ఈ భామ, అదే ప్రాంతం నుండి వచ్చిన రష్మిక మందన్న (Rashmika Mandanna) కి గట్టి పోటీ ఇస్తుంది అనటం లో సందేహం లేదు అని టాక్ నడుస్తోంది పరిశ్రమలో. ఎందుకంటే రష్మిక కూడా ఇలానే తెలుగులో ఆరంగేట్రం చేసి ఇప్పుడు హిందీ సినిమాలు చేస్తోంది. ఇప్పుడు కృతి శెట్టి కూడా అదే బాటలో వెళుతూ ఆమెకి ముందు ముందు గట్టి పోటీ ఇస్తుంది అని అనుకుంటున్నారు పరిశ్రమలో. ఇప్పుడు బెంగుళూరు నుండి వచ్చిన నటీమణులు ఎక్కువగా వున్నారు టాలీవుడ్ లో, అందులో చిన్న వయసులో వున్న కృతి శెట్టి టాప్ కి రీమేక్ అవగల కెపాసిటీ వుంది అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-03-15T13:00:09+05:30 IST