సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘కింగ్‌ 100’ వాయిదా తప్పదా.. ఇక స్టార్ట్ చేయండయ్యా

ABN, Publish Date - Nov 24 , 2026 | 05:51 PM

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ స్టార్, కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ అందరి దృష్టి ఒక్క సినిమాపైనే పడింది.

King100 Update

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ స్టార్, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ అందరి దృష్టి ఒక్క సినిమాపైనే పడింది. అదే ఆయన ల్యాండ్‌మార్క్ మూవీ.. ‘కింగ్ 100’(King 100). తొంబై తొమ్మిది సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన నాగార్జున, తన కెరీర్ నూరవ ప్రాజెక్ట్‌ను ఎంత ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు కార్తీక్ ఈ చిత్రాన్ని ఒక పక్కా సాలిడ్ గ్యాంబ్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అక్కినేని ఫ్యాన్స్‌ (Akkineni Fans)లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో హైప్ మరింత పెరిగింది.


షెడ్యూల్ ప్రకారం చూస్తే సినిమా థియేటర్లలోకి రావడానికి సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. సాధారణంగా ఇంత పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఈ పాటికి ప్రమోషన్లు హోరెత్తిపోవాలి. సాంగ్స్ రిలీజ్ కావాలి, టీజర్లు సందడి చేయాలి, రోజుకో క్రేజీ పోస్టర్ బయటకు రావాలి. పైగా అదే సమయంలో బాక్సాఫీస్ బరిలో ఉన్న ఇతర చిత్రాలు ఇప్పటికే అప్‌డేట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం పూర్తి నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. ఇప్పటివరకు టీమ్ నుంచి కనీస బజ్ కూడా కనిపించడం లేదు. ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చలకు తావిస్తోంది. అసలు ఈ సైలెన్స్ వెనుక ఉన్న ప్లాన్ ఏంటి?


నాగార్జున టీమ్‌ మౌనమే ఇప్పుడు రకరకాల రూమర్లకు దారితీస్తోంది. సినిమా అనుకున్న సమయానికి రావడం అనుమానమేనా..? ‘కింగ్100’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందా? అనేలా వార్తలు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా చక్కర్లు కొడుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయా, లేక బిజినెస్ లెక్కలతో పాటు థియేటర్ల సర్దుబాటు కోసం మేకర్స్ వెనకడుగు వేస్తున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఒకవైపు ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో పాటు గందరగోళంలో పడ్డారు. సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌ను నేరుగా ప్రశ్నిస్తున్నారు. మరి వీటిని గమనించారేమో తెలియదు కానీ, టీమ్ తాజాగా మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. కచ్చితంగా అదే డేట్‌కి సినిమా వస్తుందని క్లారిటీ ఇచ్చింది. మరి, ఇకనైనా ప్రమోషన్స్ జోరు పెంచుతారేమో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

చరిత్రను తెలుసుకుందాం.. ఫూలే దంపతుల పోరాటానికి తెరపై నివాళి

‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే

సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

Updated Date - Nov 24 , 2026 | 09:43 PM