‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:19 PM

నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా రూపొందుతున్న ఫ్రెష్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’. ఈ మూవీ ట్రైలర్‌ విడుదలకు సంబంధించి ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది.

Alias Rukmini Promotion

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నితిన్ (Nithiin) హీరోగా రూపొందుతున్న ఫ్రెష్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini). ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ (Muralikanth Devasoth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీప్తి గంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్‌ను ఆకట్టుకుని సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు టీజర్ గానీ, ట్రైలర్ గానీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాని, దర్శకుడు మురళీకాంత్ మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ వీడియోను మేకర్స్ వదిలారు. ఇందులో నాని తనపై తానే వేసుకున్న సెటైర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో దర్శకుడు మురళీకాంత్ నాని వద్దకు వచ్చి.. ‘‘అన్నా, ‘అలియాస్ రుక్మిణి’కి ఎలాంటి ట్రైలర్ లేకుండా నేరుగా సినిమానే థియేటర్లలో విడుదల చేద్దామా?’’ అని అడిగారు. ఆ మాట వినగానే నాని ఒక్కసారిగా షాక్ అవుతూ.. ‘‘అనుభవంతో చెబుతున్నాను.. దయచేసి ఆ పని మాత్రం చేయకు! ట్రైలర్ లేకుండా సినిమాను విడుదల చేయకూడదు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానో అర్థం చేసుకో’’ అంటూ సీరియస్‌గా, అంతే సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఎలాంటి ట్రైలర్ లేకుండా నేరుగా విడుదల చేయడం, ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్, రిజల్ట్‌పై పడటాన్ని నాని ఇలా గుర్తుచేసుకుంటూ తనపై తానే సెటైర్ వేసుకోవడం అందరినీ నవ్విస్తోంది.


నాని తన స్వీయ అనుభవంతో ఇచ్చిన ఈ సలహాతో, దర్శకుడు మురళీకాంత్ ఎట్టకేలకు ట్రైలర్‌ (Alias Rukmini Trailer)ను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే విషయాన్ని వినూత్నంగా ప్రకటిస్తూ.. నవంబర్ 26న ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ప్రమోషన్లలో భాగంగా నాని ఆడిన ఈ సెల్ఫ్-ట్రోల్ గేమ్ సినిమాకు మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, సృజన ఆదుసుమిల్లి ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?

‘దేవర’కు గ్రహణం వీడింది.. బుల్లితెరకు వచ్చే సమయం ఆసన్నమైంది

Updated Date - Nov 24 , 2026 | 03:20 PM

Alias Rukmini: రుక్కు రుక్కు రుక్మిణి.. కిట్టయ్యకి నువ్వే అలివేణి

Nithiin: ఆ నలుగురు ఫేట్ మార్చగలరా!

Nithiin: 12 ఏళ్ల తర్వాత.. జానర్‌ ఏంటో?

Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..

Natural Star Nani: సినిమా చూడాలనే థాట్‌ని ట్రిగ్గర్ చేయడం చాలా పెద్ద పని