King 100: పండు.. అదరగొట్టేసందిగా
ABN , Publish Date - Nov 04 , 2026 | 10:11 AM
దాదాపు 28 సంవత్సరాల తర్వాత యువ సామ్రాట్ నాగార్జున, టబు నటిస్తున్న చిత్రం కింగ్ 100 నుంచి టబు పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు.
దాదాపు 28 సంవత్సరాల తర్వాత యువ సామ్రాట్ నాగార్జున (Nagarjuna), టబు (Tabu)జంటగా నటిస్తున్న చిత్రం కింగ్ 100 (KING100 ). ఇటీవలే సినిమా పేరును ఖైదీ 100గా మార్చారు. తమిళ డైరెక్టర్ రా కార్తీక్ (Ra Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) నిర్మిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నాడు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24 ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కొక్కటిగా సినిమా క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లిమ్స్ క్యూరియాసిటీని రెట్టింపు చేశాయి.
తాజాగా సినిమాలో కీ రోల్ చేస్తున్న టబు పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన 53 సెకన్ల నిడివి వీడియో గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంది. మహంతి ఝాన్షీ రాణి (MAHANTHI JHANSI RANI)గా ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో టుబు దుమ్ము రేపింది. ఆ స్క్రీన్ ప్రజెన్స్.. డైలాగ్ డెలివరీతో పండుగానే కాదు ఝాన్షీ రాణిగా కూడా నాగర్జునకు ధీటైన ప్రత్యర్థిని అని నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ లెవల్‌లో హంగామా సృష్టిస్తోంది. మీరూ ఈ వీడియోపై ఓ లుక్ వేయండి మరి.