King 100: ఎటో వెళ్లిపోయింది మనసు అంటూ టబు ప్రీ గ్లింప్స్.. అదిరింది
ABN , Publish Date - Nov 02 , 2026 | 08:34 PM
టాలీవుడ్ లో కొన్ని పెయిర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి పెయిర్స్ లో అక్కినేని నాగార్జున (Nagarjuna)- టబు (Tabu) మొదటి వరుసలో ఉంటారు.
టాలీవుడ్ లో కొన్ని పెయిర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి పెయిర్స్ లో అక్కినేని నాగార్జున (Nagarjuna)- టబు (Tabu) మొదటి వరుసలో ఉంటారు. నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాల్లో వీరి రొమాన్స్ చూసి నిజంగా ఈ జంట పెళ్లి చేసుకుంటే బావుండు అని అనుకోని వారులేరు అంటే ఆశ్చర్యం లేదు. ఆ తరువాత సిసింద్రీలో నాగ్ తో పాటు ఒక సాంగ్ లో కనిపించిన టబు.. ఇప్పటివరకు మరోసారి నాగ్ సరసన ఆడిపాడలేదు. ఇన్నేళ్ల తరువాత ఈ జంట మరోసారి స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారు. 'కింగ్' నాగార్జున మైలురాయి చిత్రం కింగ్ 100 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తోండగా టబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక కింగ్ 100 నుంచి టబు గ్లింప్స్ ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఈ గ్లింప్స్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను నవంబర్ 4న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియజేస్తూ.. ఒక చిన్న ప్రీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రీ గ్లింప్స్ లో నిన్నే పెళ్ళాడతాలోని ఐకానిక్ సాంగ్ ఎటో వెళ్ళిపోయింది మనసు సాంగ్ ప్లే అవుతుండగా.. టబు నడవడాన్ని చూపించారు. ఈ వీడియోలో ఆమె నిండైన చీరకట్టుతో.. ముడితో ఎంతో క్లాస్ గా కనిపించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకశాన్ని తాకాయి. ఈసారి ప్రేమ కాదు అని ఇచ్చిన క్యాప్షన్ తోనే సినిమాలో టబు - నాగార్జున మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని హింట్ ఇచ్చారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, నాగార్జున గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడమే కాకుండా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఇప్పుడు టబు క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్. దీంతో ఈసారి నాగార్జున కింగ్ 100 తో కచ్చితంగా హిట్ అందుకుంటాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.