King100: నాగ్ వందో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

ABN , Publish Date - Aug 02 , 2026 | 04:41 PM

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మైలురాయి చిత్రం ‘King100’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

King100 Music Director Update

కింగ్ అక్కినేని నాగార్జున (King Nagarjuna) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మైలురాయి చిత్రం ‘King100’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఒక్క పూజా కార్యక్రమాల ఫొటోలు మినహా.. ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ మూవీకి సంగీతం అందించే సంగీత దర్శకుడు ఎవరో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా డీఎస్పీని ఆహ్వానిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కింగ్, దేవిశ్రీ.. ఈ సంచలన కాంబో.. సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెంచేసిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.


గతంలో నాగార్జున - దేవిశ్రీ ప్రసాద్‌ కలయికలో వచ్చిన ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’ వంటి చిత్రాలు మ్యూజికల్‌గా, కమర్షియల్‌గా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. వీళ్లు ఎప్పుడు జతకట్టినా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యత ఉన్న 100వ సినిమా కోసం ఈ ఐకానిక్ కాంబో రిపీట్ అవుతుండటంతో అక్కినేని అభిమానులు, సంగీతాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


King100.jpg

రా. కార్తీక్ (Ra. Karthik) దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి సరికొత్త ఎనర్జీని, చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘King100’ ప్రమోషన్ల శ్రీకారంతోనే దేవిశ్రీ ప్రసాద్ బోర్డ్‌లోకి రావడం సినిమా రేంజ్‌ను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారనే విషయంలో ఓ రేంజ్‌లో చర్చలు నడుస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

నాటు నాటు పాటకు కీరవాణి డ్యాన్స్.. ఎవరితో కలసి చేశారంటే

‘ఇరుముడి’ నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే

‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్‌గా ఎవరో తెలుసా..

Updated Date - Aug 02 , 2026 | 04:41 PM