Killer: ఇండియాలో ఫస్ట్ సూపర్ షీ మూవీ
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:31 PM
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్(poorvaj).
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్(Poorvaj). ఇప్పుడు 'కిల్లర్' (killer) అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనే కథానాయకుడు. జ్యోతి పూర్వజ్ (jyothy Poorvaj) హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు.

ఆదివారం 'కిల్లర్' సినిమా ఇచ్చారు. మేకర్స్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీగా 'కిల్లర్' ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. త్వరలోనే 'కిల్లర్' విడుదల తేదీన ప్రకటిస్తామని తెలిపారు.