Killer First Look: కిల్లర్ లుక్
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:15 AM
ఎస్. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్’. వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక...
ఎస్. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్’. వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. శనివారం చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. గన్ పట్టుకొని, ప్రీతి అస్రానీని భుజాన ఎత్తుకున్న లుక్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.