ఇంకొన్ని గంటల్లో ఓటీటీకి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. వివరాలివే

ABN , Publish Date - Oct 28 , 2026 | 03:56 PM

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్‌లో సోలో హీరోగా పరిచయమైన క్రేజీ ఫాంటసీ కామెడీ డ్రామా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు అంతా సిద్ధమైంది.

dont trouble the trouble ott

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) టాలీవుడ్‌లో సోలో హీరోగా పరిచయమైన క్రేజీ ఫాంటసీ కామెడీ డ్రామా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don't Trouble the Trouble). శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సమర్పించగా.. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.


థియేట్రికల్ విడుదలకు ముందు ఈ చిత్రానికి వచ్చిన ప్రమోషన్స్ మామూలు హైప్‌ను తీసుకురాలేదు. ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా ఈ సినిమాను సమర్పించడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ అగ్ర హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని బజ్‌ను అమాంతం పెంచేశారు. అయితే, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ స్థాయి అంచనాలను అందుకోవడంలో తడబడింది. ఫాంటసీ, కామెడీ అంశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది.


ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించగా, కాలభైరవ సంగీతం అందించారు. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.., ఓటీటీలో ఆదరణ రాబట్టుకుంటోన్న సినిమాలు ఇటీవల ఎన్నో వచ్చాయి. మరి రాజమౌళి బ్యాకింగ్‌తో వచ్చిన ఈ వినూత్న ఫాంటసీ కామెడీ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనవడి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని

రజనీతో రజనీకే పోటీ.. టాప్‌-3లో ఒకడే కింగ్‌

Updated Date - Oct 28 , 2026 | 03:56 PM

Don't Trouble The Trouble Review: రాజమౌళి.. డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ

Fahadh Faasil: పారితోషికం.. ఆ విషయం నాకూ తెలీదు!

Fahadh Faasil: అలా అడిగితే పారిపోయే ప్రయత్నం చేస్తా!

Fahadh Faasil: సినిమాలు ఇక చాల్లే.. చూడలేకపోతున్నాం

Fahadh Fassil: ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ ట్రైలర్‌ బాలకృష్ణ వాయిస్‌తో అదిరిపోయింది