సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వచ్చే దీపావళికి 'కరికాల 2', 'స్పిరిట్‌' పోటీ!

ABN, Publish Date - Oct 19 , 2026 | 02:33 PM

సందీప్‌ కిషన్‌ 'కరికాల' రెండో భాగం 2027 అక్టోబర్ 28న విడుదల కానుంది. అదే సమయంలో ప్రభాస్‌ 'స్పిరిట్‌' కూడా దీపావళి బరిలోకి దిగనుంది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Karikaala Vs Spirit

సందీప్‌ కిషన్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కరికాల'. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. 'శాంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్‌, గాయత్రి భరద్వాజ్‌, సాక్షి మడోల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ అత్యంత ఘనంగా ఇటీవల మొదలైంది. 'శంబాల'కు సంగీతం అందించిన శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకూ మ్యూజిక్‌ ఇస్తున్నాడు. సంగీత దర్శకుడిగా అతనికి ఇది 58వ చిత్రం.


ఈ సినిమా గురించి దర్శకుడు యుగంధర్‌ ముని మాట్లాడుతూ, 'అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుందని, నాగలోకం, వానర లోకం అంటూ కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం క్రియేట్‌ చేయబోతున్నామ'ని తెలిపారు. ఈ సినిమా ప్రథమ భాగం 2027 జూలై 2న విడుదల కాబోతోంది. అలానే దాని రెండో భాగాన్ని కూడా వచ్చే సంవత్సరమే దీపావళి కానుకగా అక్టోబర్ 28న విడుదల చేయాలని భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే 'కరికాల' సినిమా షూటింగ్‌ ప్రారంభం కాకముందే ఈ రెండు భాగాల రిలీజ్‌ డేట్స్ ను మేకర్స్ లాక్ చేసి పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా సినిమా ప్రారంభోత్సవాన్ని, షూటింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు.

శుభమా అని షూటింగ్‌ ప్రారంభించిన రెండు మూడు రోజులకే ఈ 'కరికాల' ద్వితీయ భాగానికి 'స్పిరిట్‌' రూపంలో పోటీ ఎదురైంది. 'కరికాల'ను మేకర్స్ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. దీని రెండో భాగం 2027 అక్టోబర్ 28న వస్తుంటే... ఆ మర్నాడే అక్టోబర్ 29న 'స్పిరిట్‌' విడుదల కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే కావడం విశేషం. అలా వచ్చే దీపావళికి రెండు పాన్ ఇండియా తెలుగు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అయితే ఆ సమయానికి మరికొన్ని సినిమాలు వీటితో జత అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తం మీద ఇది 'కరికాల' టీమ్‌ను కాస్తంత ఇబ్బందికి గురిచేసే అంశమే అనుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ ర్యాంపేజ్.. తెలుగు రాష్ట్రాల్లో ‘విరోష్’ సందడి

‘జైలర్ 2’ సెట్‌లో మోహన్ బాబు.. ‘జైలర్ 3’లో ఏమైనా?

లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

Updated Date - Oct 19 , 2026 | 02:40 PM