Dragon: ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్.. ‘డ్రాగన్’ కోసం ఇక ఫుల్ స్పీడ్!
ABN, Publish Date - Oct 16 , 2026 | 02:04 PM
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవల ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న తారక్.. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవల ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న తారక్.. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆయన పాల్గొనాల్సిన సన్నివేశాల చిత్రీకరణకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే, ఈ సమయంలో హీరోతో సంబంధం లేని సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తన బృందంతో పూర్తి చేశారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్ అక్టోబర్ 15న తిరిగి ‘డ్రాగన్’ సెట్స్లో అడుగుపెట్టారు. దీంతో సినిమా షూటింగ్ మళ్లీ వేగం అందుకోనుంది.
తాజా సమాచారం ప్రకారం ఇకపై చిత్రీకరణకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా షెడ్యూల్స్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. తారక్ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. 2027 జూన్లో విడుదల లక్ష్యంఎన్టీఆర్ గాయం కారణంగా షూటింగ్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకోవడంతో ‘డ్రాగన్’ విడుదల ప్రణాళిక కూడా మారింది. తొలుత 2026 జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఫిబ్రవరి నాటికి చిత్రీకరణను పూర్తి చేయాలని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్, అశుతోష్ రాణా, కుష్బూ సుందర్, అన్షుమాన్ పుష్కర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..
Aishwarya Lekshmi: లైఫ్ పార్టనర్ ముందు ఎలా ఉండాలంటే..
jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి