Ramayana: శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది

ABN , Publish Date - Oct 30 , 2026 | 09:13 PM

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తోన్న పాత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Rakul in Ramayana

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). దంగల్ ఫేమ్ నితేశ్ తివారీ దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కీలకమైన శూర్పణఖ (Surpanakha) పాత్రలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.


“జనస్థాన్‌కి రాజకుమారి.. శూర్పణఖ” అంటూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంప్రదాయ బంగారు వర్ణపు ఆభరణాలు, రాజసం ఉట్టిపడే రాయల్ కాస్ట్యూమ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లో కనిపిస్తున్నారు. రామాయణ గాథలో కథను కీలక మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన శూర్పణఖ పాత్రను రకుల్ ఎలా పోషించబోతోందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఈ భారీ ప్రాజెక్ట్‌లో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటిస్తుండగా.. రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్ఈజీ (DNEG), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ఎపిక్‌ను నిర్మిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సంస్థ ఎస్‌వీసీ (SVC) ద్వారా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, హిందీలో ధర్మ ప్రొడక్షన్స్, అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్ విడుదల చేస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో మొదటి భాగం ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 5 నవంబర్, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి:

కమెడియన్ వడివేలు 100 కోట్ల భవంతిని చూశారా.. ‘హౌస్ టూర్’ వీడియో వైరల్

జయలలిత పాత్రలో త్రిష? ఎంజీఆర్ బయోపిక్‌లో వాస్తవాలు చూపిస్తారా?

రెండు పార్ట్‌లుగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా? మరో ‘కింగ్‌డమ్’ కాదు కదా..

Updated Date - Oct 30 , 2026 | 09:13 PM

Ramayana : రావణుడొచ్చాడు!

Ramayana teaser: వేవ్స్ సమ్మిట్ లో రామనామం

Ramayana-Namit malhotra: నచ్చకపోతే మా ఫెయిల్యూర్‌గానే భావిస్తాం

Ramayana Movie: యశ్‌ను అలా చూస్తే చాలు.. డైలాగ్ కూడా అవసరం లేదు.. రకుల్ కామెంట్స్

Ramayana: ఈ సీత‌మ్మ‌పైనే.. ట్రోల్స్ ఎందుకు!