జనవరి 12న విడుదల.. అనిల్ రావిపూడి, నీ చర్యలు ఊహాతీతం
ABN, Publish Date - Oct 16 , 2026 | 11:22 PM
విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) బావ బామ్మర్ది సౌజన్యంతో. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జీ.వి. ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనిల్ రావిపూడి సినిమా వస్తుందంటే చాలు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక వైబ్, ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. గతంలో ‘ఎఫ్-2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్లతో సంక్రాంతి సీజన్‌ను ఏలుతూ వస్తున్నారు అనిల్ రావిపూడి. అంతేకాదు, ఈ ఏడాది పొంగల్‌కి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో, మరింత మాస్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌లను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువస్తున్నారు. తన తొలి హీరో కళ్యాణ్ రామ్ మాస్ ఎనర్జీ, హ్యాట్రిక్ హీరో వెంకటేశ్ మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న న్యూస్... ఫస్ట్ సింగిల్ గురించి. ఈ మూవీలోని తొలి పాటను ఈ నెల చివరి నాటికి విడుదల చేసేందుకు చిత్ర బృందం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ జీ.వి. ప్రకాశ్ కుమార్ ఈ ఫస్ట్ సింగిల్ కోసం ఒక సూపర్ అండ్ చార్ట్‌బస్టర్ ట్యూన్‌ను సిద్ధం చేశారట. అనిల్ రావిపూడి సినిమాల్లో పాటలు ఏ స్థాయిలో బూస్ట్ ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలీజ్‌కు చాలా రోజుల ముందే పాటలతో సినిమాపై హైప్ క్రియేట్ చేయడం ఆయన స్టైల్. ఇప్పుడు జీవీ ఇచ్చిన ఈ ఫస్ట్ సాంగ్‌తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ పాటకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత నెలలో మైసూర్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ఇటీవలే ఊటీకి షిఫ్ట్ అయింది. ఊటీలో జరగనున్న ఈ తాజా షెడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్లో భాగంగా రెండు పాటలతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అంతేకాదు, ఊటీ షెడ్యూల్లోనే ఈ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి వెంకీ మామ కామెడీ, కళ్యాణ్ రామ్ మాస్ ఎనర్జీ కలిసి జనవరి 12న బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేయబోతున్నాయో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
Danny: రా అండ్ రస్టిక్ చిత్రం ‘డానీ’ రిలీజ్ డేట్ ఖరారు
త్వరలోనే థియేటర్లలోకి రాబోతోన్న ‘భగవంతుడు’
యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేలా.. నిర్మాత రాజ్ అల్లాడ అడుగులు