Anupama Parameswaran: ఎన్నో కష్టాలు భరించా.. విమర్శలొచ్చినా వెనక్కి తగ్గను

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:43 AM

నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మరోసారి మనసు విప్పి మాట్లాడారు.

నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మరోసారి మనసు విప్పి మాట్లాడారు. తనకు ఎదురైన వేధింపుల కారణంగా ఒకానొక సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, చివరకు నటనకు స్వస్తి చెప్పాలని కూడా భావించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘క్రేజీ కల్యాణం’ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. 

‘‘నాకు  కష్టం వచ్చినప్పుడు ప్రతిరోజూ ఎంతో భారంగా జీవితాన్ని నెట్టుకొచ్చాను. ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నిరంతరం ఏదో ఒకదానితో పోరాడాల్సి వచ్చేది. రోజు ముగిసే సమయానికి ‘ఈరోజు బతికిపోయాను దేవుడా’ అనిపించేది. జీవితమే ఓ సవాలుగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నటన కూడా మానేయాలని అనుకున్నాను. కానీ, ధైర్యంగా ముందుకు సాగాను. అద్దంలో చూసుకున్నప్పుడు ఇవన్నీ భరించింది నేనేనా అనిపించేది. ఇలాంటి విషయాల గురించి బయట మాట్లాడితే విమర్శలు ఎదురవుతాయని అనుకున్నాను. కానీ, నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది నాకు అండగా నిలిచారు. ఎంతో మద్దతు ఇచ్చారు. నా అనుభవాలు కొందరిలోనైనా ధైర్యాన్ని నింపుతాయంటే.. ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అనుపమ పరమేశ్వరన్‌ తెలిపారు. తాజాగా ఆమె నటించిన  ‘క్రేజీ కల్యాణం’  సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో కీర్తి పాత్రలో అనుపమ అలరించారు.

ALSO READ:
Ranabaali X Review: ‘రణబాలి’కి మిక్స్‌డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

Aishwarya Lekshmi: లైఫ్‌ పార్టనర్‌ ముందు ఎలా ఉండాలంటే..

jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి

Updated Date - Oct 16 , 2026 | 02:57 PM