సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చరణ్‌ని అలా అనగానే చిరంజీవి ఫీలయ్యారు: జగపతిబాబు

ABN, Publish Date - Jun 12 , 2026 | 12:19 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘పెద్ది’ పాత్రకు, ఆ పాత్రలో నటించిన రామ్ చరణ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగ్గుభాయ్, బుచ్చిబాబు సానా చిట్ చాట్ నిర్వహించారు.

Jagapathi Babu and Buchi Babu Sana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘పెద్ది’ పాత్రకు, ఆ పాత్రలో నటించిన రామ్ చరణ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. మొదటి రోజు కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఆ మరుసటి రోజు నుంచి టాక్ మారి, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల రికార్డులు బద్దలవుతున్నాయి. సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సినిమాపై మరింత ఆసక్తిని కలిగించేలా దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన జగపతిబాబుతో కలిసి సినిమా విశేషాలను పంచుకున్నారు.


ఈ ఇంటర్వ్యూలో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పల సూరి పాత్రను డిజైన్ చేసిన తీరుకు హ్యాపీగా ఉన్నానని చెప్పిన జగపతిబాబు.. ‘రంగస్థలం’ (Rangasthalam) టైమ్‌లో చిరంజీవి (Chiranjeevi)తో ఓ మాట చెప్పగా ఆయన ఫీలయ్యారని తెలిపారు. ‘‘రామ్ చరణ్ ఒక మెగాస్టార్ కొడుకు, పైగా మెగా పవర్ స్టార్. ఆస్కార్, RRR వంటి ఎన్నో అచీవ్‌మెంట్లు ఉన్న ఒక హీరోని ఈ సినిమాలో చాలా కష్టపెట్టావు బుచ్చిబాబు. ఆయన కూడా పాపం అన్బిలీవబుల్ కష్టం చేశాడు. ఉదాహరణకు నేను చేసిన ‘రంగస్థలం’ సినిమా తీసుకుంటే.. అందులో కష్టం కంటే ఎమోషన్, డ్రామా ప్లే చేయడం కొంచెం ఈజీ. కానీ ఈ సినిమాలో బాడీ బిల్డ్ చేసి, మళ్లీ బాడీ తగ్గించి క్యారెక్టర్‌ను ప్లే చేయడం అనేది మెంటల్లీ, ఫిజికల్లీ చాలా కష్టమైన పని. చరణ్ నిజంగా ప్రాణం పెట్టి పనిచేశాడు. నేను ‘రంగస్థలం’ సినిమా అప్పుడు ఒక మాట అన్నాను. ఆ మాటకి చిరంజీవి కూడా స్టేజ్ మీద కొంచెం ఫీల్ అయ్యారు. నేను ఏమన్నానంటే, ‘ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ యాక్ట్ చేశాడు, నాకు విపరీతంగా నచ్చాడు’ అన్నాను. ఆ ‘రంగస్థలం’ సినిమా దగ్గర నుంచి చరణ్ తన ప్రతి సినిమాకి 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఎదుగుతూ వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమాకు అయితే పీక్. ఆయన ఒక సూపర్ ఆర్టిస్ట్’’ అని చెప్పుకొచ్చారు.


బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, సినిమా చూసిన వాళ్లంతా కానీ ‘పెద్ది’ గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమాలో ఎక్కడా రామ్ చరణ్ కనిపించలేదు, కేవలం ‘పెద్ది’ క్యారెక్టర్ మాత్రమే కనిపించిందని అంటున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ అలా ఉంది. చరణ్ నటన చూసి ప్రతి ఒక్కరూ ఆయనకు ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని అంటున్నారు. రంగస్థలం, RRR అన్నీ బాగున్నాయి కానీ, ఇందులో ఆయన పెర్ఫార్మెన్స్ పీక్‌కి వెళ్ళిపోయింది. జనాలు కూడా ఫస్ట్ మార్కులు దీనికే వేసేస్తున్నారు. ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, అంత అద్భుతంగా చేశారు చరణ్. సినిమాలో ఒక జోక్ వేస్తే సరదాగా నవ్వేయడం ఈజీ, కానీ ఒకరిని ఏడిపించడం అనేది మామూలు విషయం కాదు. నిన్న నేను అల్లు స్టూడియోస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని సినిమా చూస్తున్న లేడీస్ అంతా కళ్ళు తుడుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా ఈ సినిమాకు లేడీ ఆడియన్స్‌ కనెక్ట్ అవుతున్నారు’’ అని తెలిపారు.

జగపతి బాబు, బుచ్చిబాబుల ఫుల్ ఇంటర్వ్యూ కోసం కింది వీడియో క్లిక్ చేయండి:

ఇవి కూడా చదవండి:

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

Updated Date - Jun 12 , 2026 | 12:19 AM