Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసుల నోటీసులు.. అక్టోబర్ 28 డెడ్‌లైన్!
ABN, Publish Date - Oct 15 , 2026 | 12:46 PM
బాలీవుడ్ నటుడు, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
బాలీవుడ్ నటుడు, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు (Imran Khan) ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అక్టోబర్ 28లోగా ఆయన భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు .తెలిసింది. ఇటీవల ముంబయిలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదానం వద్ద జరిగిన నిరసనలో ఇమ్రాన్ పాల్గొన్నారు. దీనిపై భాజపా నేత కిరీట్ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికా పౌరుడైన ఇమ్రాన్ ఖాన్ OCI, వీసా నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ఈ నిరసనలో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు నటి జైన్ మేరీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత వారిని విడుదల చేశారు. తాజాగా ఇమ్రాన్‌కు నోటీసులు జారీ అయినట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
పోలీసుల చర్యను స్వాగతించిన కిరీట్
ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు జారీ అయినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో కిరీట్ సోమయ్య స్పందించారు. పోలీసులు తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్‌పై తాను ఫిర్యాదు చేయడానికి గల కారణాలను వెల్లడించారు. "పాకిస్థాన్ నుంచి నిధులు పొందుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా పౌరుడు ఇమ్రాన్ ఖాన్.. భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు విదేశీ శక్తులతో కలిసి కుట్ర చేస్తున్నాడని నేను భావిస్తున్నాను. అందుకే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాను. అక్టోబర్ 28లోగా అతడు భారత్‌ను విడిచి వెళ్లాల్సి ఉంటుంది’’ అని కిరీట్ సోమయ్య పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..
Soori7: మైత్రీ మూవీ మేకర్స్‌లో సూరి కొత్త ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభం