Ameerkhan, Allu Arjun: అమీర్ ఖాన్ ప్లానింగ్: అర్జునుడిగా అల్లు అర్జున్?
ABN , Publish Date - May 12 , 2025 | 01:22 PM
అమీర్ ఖాన్ ఇప్పుడు తన నెత్తిమీద ఓ భారీ ప్రాజెక్ట్ వేసుకొన్నాడు. మహాభారత గాథని ఐదు భాగాలుగా తీయాలన్నది అమీర్ డ్రీమ్. అందుకోసం సన్నాహాలు చేస్తున్నాడు.

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ (Ameerkhan) తన గత చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్రం తర్వాత గ్యాప్ ఇచ్చిన ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి సారించాడు. ఈక్రమంలో తారే జమీన్ ఫర్ సినిమాకు సీక్వెల్ సీతారే జమీన్ ఫర్ సినిమాను రూపొందించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సందర్భంగా ప్రచార కాక్యక్రమాలు సైతం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమీర్ రాబోయే సర్వత్రా చర్చ మొదలవగా ఆసక్తి కరంగా కొత్త వార్తలు తెరపైకి వచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ వార్తలేంటంటే.. అమీర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారత (Mahabarath) గాథని తెరకెక్కించాలని సంకల్పించాడు. ఈ విషయవ చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా కూడా ప్రకటించాడు. అయితే ఈ మహా భారత్ ను ఐదు భాగాలుగా తీయాలని సన్నాహాలు చేస్తుండగా అందులో తొలి భాగానికి బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ (Sanjay Leela Bhansali) ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నటించేందుకు దేశంలోని అన్ని ఇండస్ట్రీల నుంచి బాగా పేరున్న వారిని తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సౌత్ నుంచి కూడా పలువురు అగ్ర తారలు నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా భారతంలో కీలకం అయిన అర్జునుడి పాత్ర కోసం అల్లు అర్జున్ (Allu Arjun) ని సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఇటీవల అట్లీ తో చేయబోతున్న పాన్ వరల్డ్ సినిమా కోసం ముంబై వెళ్లిన బన్నీ ఓ రోజు అమీర్ ఖాన్‌ని ప్రత్యేకంగా కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగానే దర్షణమిచ్చాయి. అయితే మహా భారత్‌లో పాత్ర విషయంలోనే అమీర్ (Ameerkhan) , అర్జున్ (Allu Arjun) కలుసుకున్నారని, పాత్ర గురించి చాలా సేపు చర్చించుకున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. మరోవైపు గతంలో పలుమార్లు సంజయ్ లీలా భన్సాలీ అర్జున్‌తో సినిమా చేయాలని ప్రయత్నించినా కుదరక పోవడం, ఇప్పుడు అన్నీకలిసి వచ్చి కాంబినేషన్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలిపాయి.
అయితే.. ఐదు భాగాలుగా రానున్న మహాభారత (Mahabarath) ఈ సినిమాను ఐదుగురు పేరున్న దర్శకులతో రూపొందించి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వీటి నిర్మాణం కోసం హాలీవుడ్ నుంచి టెక్సీషియన్స్ పిలిపించి సుమారు రూ.1000 కోట్లకు పైగానే ఖర్చు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కృష్ణుడి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి గానీ దృవీకరణ కాలేదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన ద్రౌపతి పాత్ర కోసం దీపికా పదుకునేను తీసుకోవాలా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అన్వేషణ సైతంచేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజులైతే ఈ ప్రాజెక్టుపై పూర్తి సమచారం తెలియనుంది.