బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
ABN , Publish Date - Oct 15 , 2026 | 10:30 AM
‘ఉప్పెన’ చిత్రంతో వెండితెరకు పరిచయమై ‘బేబమ్మ’గా యావత్ దక్షిణాది సినీ ప్రియుల మనసు దోచుకున్న టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి. ఇప్పుడీ భామ బాలీవుడ్లో ఓ రొమాంటిక్ స్టోరీకి ఓకే చెప్పారు.
‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో వెండితెరకు పరిచయమై ‘బేబమ్మ’గా యావత్ దక్షిణాది సినీ ప్రియుల మనసు దోచుకున్న టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు బీటౌన్‌లో కథానాయికగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) సమర్పణలో తెరకెక్కనున్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ‘హమ్ తేరే ప్యార్ మే’ (Hum Tere Pyaar Mein) ద్వారా ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.
వాస్తవానికి హృతిక్ రోషన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సూపర్ 30’ (Super 30)లో కృతి శెట్టి ఓ చిన్న పాత్రలో మెరిసి తన బాలీవుడ్ ప్రయాణానికి పునాది వేశారు. ఆ తర్వాత టాలీవుడ్లో ‘ఉప్పెన’తో హీరోయిన్గా అరంగేట్రం చేసి స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు పూర్తిస్థాయి ప్రధాన కథానాయికగా బాలీవుడ్లో ‘హమ్ తేరే ప్యార్ మే’ చిత్రంతో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. గత 17 ఏళ్లుగా రోహిత్ శెట్టి డైరెక్షన్ టీమ్‌లో ఉంటూ ‘సింగం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘గోల్మాల్’ సిరీస్ వంటి బ్లాక్బస్టర్లకు అసోసియేట్‌గా పనిచేసిన విధి ఘోడ్గావ్కర్ (Vidhi Ghodgaonkar) ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కానున్నారు. రోహిత్ శెట్టి శిష్యురాలి డైరెక్షన్లో సినిమా రానుండటం, అది కూడా మనసుకు హత్తుకునే రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టితో కలిసి ఏవీఎస్ స్టూడియోస్ (AVS Studios), తుడిప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. అభిషేక్ ఎస్. వ్యాస్, దీప్తి అగర్వాల్ నిర్మిస్తుండగా, ప్రియాంక చౌదరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాదిలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కృతి శెట్టి.. ఇప్పుడు బాలీవుడ్ లీడ్ డెబ్యూతో హిందీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి! త్వరలోనే చిత్రంలో నటించే హీరో వివరాలతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరో వైపు టాలీవుడ్లో ఆమె చేస్తోన్న చిత్రం ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. సంక్రాంతి సక్సెస్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..
Soori7: మైత్రీ మూవీ మేకర్స్‌లో సూరి కొత్త ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభం
ధనుష్ అభిమాన సంఘం పేరు మార్పు.. రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చ