హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ లాంచ్‌లో ‘యమలీల’ టీమ్ సందడి
ABN, Publish Date - May 11 , 2026 | 07:07 PM
హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి నిర్మిస్తోన్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (HanShiv Entertainments) బ్యానర్‌పై టి.డి. ప్రసాద్ వర్మ (T.D. Prasad Varma) దర్శకత్వంలో ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి నిర్మిస్తోన్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అనురాగ్, సంతోష్, సాయి విక్రాంత్, అలీ, చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫణి, వినీత రెడ్డి తదితరులు నటిస్తోన్న ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ‘యమలీల’ (Yamaleela) టీమ్ సందడి చేసింది. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, నటుడు అలీ, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఫణి సహా చిత్రయూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె. అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా.. డైరెక్టర్ టి.డి. ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. ఓ డిఫరెంట్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. మా టీమ్‌ను ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అలీ ఇందులో ఓ కీలక పాత్రలో మెప్పించనున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని పేర్కొన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ.. మా దర్శకుడు ప్రసాద్ వర్మ చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. నిర్మాతలు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇందులో విలక్షణమైన పాత్రతో ఆడియెన్స్‌ను అలరించబోతున్నాను. ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, అలీలతో పాటు వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలని అన్నారు. అలీ మాట్లాడుతూ.. హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రాబోతున్న తొలి సినిమా ఇది. ఇందులో నేను కూడా ఓ మంచి పాత్రలో కనిపించబోతున్నాను. సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. డైరెక్టర్ ప్రసాద్ వర్మ ఓ వైవిధ్యమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని నిర్మాతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి