నాని ‘ద ప్యారడైజ్’కు.. మహేష్ తనయుడు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా?

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:03 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని సినిమాలను చూసే తీరు, ఇచ్చే నిజాయితీ గల రివ్యూలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా ఆయన నాని ‘ది ప్యారడైజ్’ సినిమాకు ఇచ్చిన రేటింగ్ హాట్ టాపిక్‌గా మారింది.

Gautam Review on The Paradise

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తనయుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni) సినిమాలను చూసే తీరు, ఇచ్చే నిజాయితీ గల రివ్యూలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ప్రముఖ మూవీ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ ‘లెటర్‌బాక్స్‌డ్’ ఐడీని యాడ్ చేసినప్పటి నుంచి.. ఆయన ఇచ్చే రేటింగులపై నెటిజన్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు కూడా పక్షపాతం లేకుండా నిక్కచ్చిగా రేటింగ్స్ ఇచ్చే గౌతమ్.. తాజాగా నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటించిన చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise)పై షాకింగ్ రివ్యూ ఇచ్చారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ కేవలం ‘1 స్టార్’ రేటింగ్ మాత్రమే ఇవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


సినిమా చూసిన అనంతరం తన లెటర్‌బాక్స్‌డ్ (LetterBoxd) ఖాతాలో గౌతమ్ ఘట్టమనేని ఘాటు వ్యాఖ్యలతో కూడిన రివ్యూను రాసుకొచ్చారు.. ‘‘నాకు సినిమాలో సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్లలో నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రమే నచ్చాయి. అవి తప్ప సినిమాలో మరేదీ నచ్చలేదు. చాలా తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా ఎడిటింగ్ అయితే చాలా ఘోరంగా ఉంది’’ అంటూ తన అసంతృప్తిని గౌతమ్ ఘట్టమనేని కుండబద్దలు కొట్టేశారు.


Gautam-Post.jpg

వాస్తవానికి నాని నటించిన క్లాసిక్ చిత్రం ‘జెర్సీ’కి గౌతమ్ వీరాభిమాని. గతంలో ఆ సినిమాపై గౌతమ్ ఎన్నో ప్రశంసలు కురిపించారు. అలాంటి గౌతమ్.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ద ప్యారడైజ్’ సినిమాకు ఏకంగా 1 స్టార్ రేటింగ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గౌతమ్ ఇప్పటివరకు రివ్యూ చేసిన నాని చిత్రాల్లో ఇదే అత్యంత తక్కువ రేటింగ్ కావడం విశేషం. సినిమాలపై గౌతమ్‌కు ఉన్న విశ్లేషణాత్మక అభిరుచిని చాలామంది అభినందిస్తున్నప్పటికీ, నాని తాజా సినిమాకు ఆయన ఇచ్చిన ఈ 1-స్టార్ రేటింగ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియుల మధ్య పెద్ద ఎత్తున డిబేట్‌కు తెరలేపింది. మరోవైపు.. గౌతమ్ కరెక్ట్‌గా జడ్జ్ చేశారంటూ కొందరు ఘట్టమనేని అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

‘జనవరి 12 విడుదల’ షాకింగ్ బిజినెస్.. మరో బ్లాక్‌బస్టర్ పక్కానా?

ఆర్ఆర్ఆర్ కంటే వారణాసి పెద్ద సినిమా.. జక్కన్న సంచలన కామెంట్స్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సాంగ్.. విశ్వక్ సేన్ అభినందనలు

Updated Date - Oct 25 , 2026 | 05:03 PM

Gautham Ghattamaneni: మహేష్ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ షురూ

Gautham Ghattamneni : మహేశ్‌ తనయుడి నటనకు ఫిదా..

The Paradise Review : ది ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

The Paradise: అందరి చూపు శ్రీకాంత్‌ ఓదెల పైనే!

The Paradise: ఏషనాగుల కట్టమీద.. వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్