The Paradise: ఏషనాగుల కట్టమీద.. వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:50 PM

దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని (Nani) - శ్రీకాంత్ ఓదెల (Sreikanth Odela) కాంబోలో తెరకెక్కిన సినిమా ది ప్యారడైజ్ (The Paradise). సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది.

The Paradise

దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని (Nani) - శ్రీకాంత్ ఓదెల (Sreikanth Odela) కాంబోలో తెరకెక్కిన సినిమా ది ప్యారడైజ్ (The Paradise). సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. మాస్ హీరోగా అనిపించుకోవాలని నాని ఈ సినిమా మొత్తాన్ని రక్తపాతంతో నింపేశాడు. మొదటి నుంచి ఫ్యాన్స్ ఈ చిత్రంపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. అనిరుధ్ మ్యూజిక్, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్.. అది కూడా యూట్యూబ్ ని ఊపేసిన ఏషనాగుల సాంగ్ రీమిక్స్ అనేసరికి.. అబ్బా ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అనుకున్నారు. తీరా సాంగ్ రిలీజ్ అయ్యాక నాని డ్యాన్స్ సెట్ అవ్వలేదని పెదవి విరిచారు. అయినా కూడా ఆ సాంగ్ వైబ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.


ఇక ఎట్టకేలకు ప్యారడైజ్ ఓటీటీ బాట పట్టనుంది. అక్టోబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలోనే హైప్ పెంచడానికి మేకర్స్.. ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఏషనాగుల వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. థియేటర్ లో ఈ సాంగ్ కు ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నాని, కీర్తి సురేష్ వేసిన రగ్గడ్ మాస్ డ్యాన్స్ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


అప్పుడే కాదు ఈ వీడియో సాంగ్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఎంత నెగిటివిటీ వచ్చినా ఈ సాంగ్ కి వైబ్ వేరు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేని ప్యారడైజ్ ఓటీటీలో ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తరువాత నాని.. సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో చేస్తున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా అలియాస్ రుక్మిణీ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో న్యాచురల్ స్టార్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 19 , 2026 | 01:52 PM