‘జనవరి 12 విడుదల’ షాకింగ్ బిజినెస్.. మరో బ్లాక్‌బస్టర్ పక్కానా?
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:06 PM
టాలీవుడ్లో సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో పూనకాలు లోడవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ‘హిట్ మిషన్’ అనిల్ రావిపూడి సినిమా ఉందంటే ఆ మ్యాజిక్కే వేరు.
టాలీవుడ్లో సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో పూనకాలు లోడవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ‘హిట్ మిషన్’ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా ఉందంటే ఆ మ్యాజిక్కే వేరు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh), నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala). టైటిల్ అనౌన్స్మెంట్ రోజే ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తూ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఈ చిత్రం, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఇప్పుడు ట్రేడ్ వర్గాలను షేక్ చేస్తోంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాహు గారపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సినిమా థియేటర్లలోకి రాకముందే ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా భారీగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ మీదే రూ. 100 కోట్లకు పైగా బిజినెస్ చేయబోతుందట. విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ప్రీ-రిలీజ్ డీల్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ అలాగే ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరలకే అమ్ముడవుతున్నాయట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే మేకర్స్ నుంచి రానుందని తెలుస్తోంది.
అసలు అనిల్ రావిపూడి సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాల్సిందేనని సినీ విశ్లేషకులు అంటుంటారు. ఆయన సినిమాల్లో ఉండే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఇక అనిల్ రావిపూడి సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన గత చిత్రాలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాయి. సరిగ్గా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ.. ఇప్పుడు వస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాతో కూడా మరోసారి బాక్సాఫీస్‌కు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు హిట్ మిషన్. వెంకటేశ్, కల్యాణ్ రామ్ వంటి ఇద్దరు మాస్ అండ్ ఫ్యామిలీ హీరోలను ఒకే స్క్రీన్ పై చూడబోతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. మొత్తానికి వచ్చే సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల పండగ పక్కా అనిపిస్తోంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి మరోసారి తన బాక్సాఫీస్ మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా బిజినెస్ అంచనాలను నిజం చేస్తూ ఏ రేంజ్లో కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఆర్ఆర్ఆర్ కంటే వారణాసి పెద్ద సినిమా.. జక్కన్న సంచలన కామెంట్స్
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సాంగ్.. విశ్వక్ సేన్ అభినందనలు
ప్రియాంక పేరు వాడుకుంటే ఇంకోలా ఉండేది: పరిణీతి చోప్రా