సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామ్ చరణ్-సుకుమార్ RC17పై క్రేజీ అప్‌డేట్

ABN, Publish Date - Sep 24 , 2026 | 12:25 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్. ఈ రెండు పేర్లు వింటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు వస్తాయి.

ramcharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar). ఈ రెండు పేర్లు వింటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు వస్తాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన, సుకుమార్ రా అండ్ రస్టిక్ టేకింగ్ ప్రేక్షకులను ఎంతగా మెస్మరైజ్ చేశాయో వేరే చెప్పనక్కర్లేదు.

అలాంటి సూపర్ హిట్ తర్వాత.. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘RC17’. 'పుష్ప 2' లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. చరణ్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. RC17 Shooting Update

ఇక ‘RC17’ ప్రాజెక్ట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక క్రేజీ వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా గ్రాండ్ లాంచ్‌పై ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలను అక్టోబర్ 20న ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు, దసరా పండుగ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

అక్టోబర్‌లో లాంఛనంగా ప్రారంభమైన వెంటనే, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనేది ఆలోచన. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే ఇది లార్జర్ దేన్ లైఫ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో.. షూటింగ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు ‘RC17’ మ్యూజిక్ విషయంలో టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం లేదట. సుకుమార్ సినిమా అంటే అక్కడ డీఎస్పీ ఉండాల్సిందే. 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకు సుకుమార్ తీసిన ప్రతి సినిమాకు డీఎస్పీ అదిరిపోయే ఆల్బమ్స్ అందించారు. అయితే ఈసారి సుకుమార్ కొత్త సంగీత దర్శకుడి వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం మొదలైంది.

దేవి ప్రస్తుతం 'ఎల్లమ్మ' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, అనిరుధ్ రవిచందర్ లేదా ‘ధురంధర్’ ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్‌లలో ఒకరిని తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు టాక్. దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి 'రంగస్థలం'తో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన ఈ కాంబినేషన్.. ‘RC17’తో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో చూడాలి.

Updated Date - Sep 24 , 2026 | 12:25 PM