సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

ABN, Publish Date - Apr 10 , 2026 | 03:36 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రంగా చెప్పుకోబడుతున్న ‘జననాయగన్’ విడుదల కష్టాలతో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. సెన్సార్ ఇష్యూస్‌తో కోర్టుకి చేరిన ఈ మూవీ రిలీజ్ వివాదం రోజుకో రకంగా మారుతూ వచ్చింది.

Chiranjeevi on Jana Nayagan Piracy

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రంగా చెప్పుకోబడుతున్న ‘జననాయగన్’ (Jana Nayagan) విడుదల కష్టాలతో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. సెన్సార్ ఇష్యూస్‌తో కోర్టుకి చేరిన ఈ మూవీ రిలీజ్ వివాదం రోజుకో రకంగా మారుతూ వచ్చింది. తమిళనాడు ఎన్నికల నిమిత్తం ఏర్పడిన ఎలక్షన్ కోడ్ రీత్యా, మరోసారి ‘జననాయగన్’ విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఇప్పుడీ సినిమా ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో.. మరో కొత్త సమస్య ఈ సినిమాకు యాడైంది. ఈ సినిమా లీకవ్వడంపై కోలీవుడ్ వర్గాల్లో రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ మూవీ లీకవ్వడం తనని ఎంతగానో కలచివేసిందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).


‘‘జననాయగన్ మూవీ దురదృష్టవశాత్తూ లీకవ్వడం (Jana Nayagan Movie leaked) నన్ను ఎంతగానో కలచివేసింది. సినిమా అనేది నమ్మకం, కష్టమే కాకుండా ఎంతోమంది కలల సమాహారం. ఇలాంటి సంఘటనలు సినిమా పరిశ్రమలో మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్‌ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటివి మనకు గుర్తుచేస్తాయి. నష్టాన్ని నివారించడంలోనూ, దోషులను శిక్షించేందుకు కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ తీసుకునే చర్యలకు మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాను. సినిమాను గౌరవించడానికి, అలాగే రక్షించడానికి మనమందరం మన మద్దతును తెలియజేద్దాం. పైరసీని అంతం చేద్దాం.. సినిమాను కాపాడుకుందాం’’ అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


‘మరో ఇండస్ట్రీకి చెందిన సినిమా ఇబ్బందులు పడుతుంటే, పెద్ద మనసుతో ఇలా స్పందించడం నీకు మాత్రమే సాధ్యం’ అంటూ మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘జననాయగన్’ విషయానికి వస్తే, ఈ సినిమా ఎప్పుడో సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఎలాగోలా, అన్ని అడ్డంకులు దాటుకుని సినిమా విడుదలవుతుందనుకునే సమయానికి తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఇప్పుడేమో, ఏకంగా ఇంటర్నెట్‌లోనే సినిమా ప్రత్యక్షమైంది. అసలీ లీక్ వెనుక ఎవరున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

కోసి కారం పెడ‌తా.. 'తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ' ట్రైల‌ర్ అదిరింది! తెలుగులో ఇలా కూడా సినిమాలు తీస్తున్నారా

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత వదినపై హీరోయిన్ హన్సిక రూ.2 కోట్ల పరువు నష్టం దావా

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

Updated Date - Apr 10 , 2026 | 03:36 PM