సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రేంజ్ మ్యాటర్.. చిరు ‘కాకా’కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్

ABN, Publish Date - Nov 04 , 2026 | 04:44 PM

ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘కాకా’ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ బిజినెస్‌కు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Kaaka Business

ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘కాకా’ (Kaaka) మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత చిరు, బాబీ కొల్లి (Bobby Kolli) కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ (Venkat K Narayana) ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మలయాళ నటి అనస్వర రాజన్ మెగాస్టార్ కుమార్తె అమ్ములుగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది.


మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు. దీంతో ‘కాకా’ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం (Kaaka Business) నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్లు కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాపై ఉన్న అంచనాలు, చిరంజీవి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మొత్తం కంటే తక్కువకు హక్కులను విక్రయించేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడంతో పాటు మరి ఈ భారీ మొత్తాన్ని చెల్లించి తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకునేందుకు ఏ పంపిణీ సంస్థ ముందుకు వస్తుందో చూడాలి.


ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు విడుదలకు ముందే వ్యాపార లావాదేవీలపై మేకర్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానున్న ‘కాకా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆసక్తికరంగా మారింది. మరో వైపు ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదని, పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా కూడా ప్రచారం నడుస్తోంది. అయితే మేకర్స్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. చూద్దాం మరి.. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందో.

ఇవి కూడా చదవండి:

‘టైసన్ నాయుడు’ నుంచి మాస్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే

నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్

సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే

Updated Date - Nov 04 , 2026 | 04:44 PM