Chandini Chowdary: చాందిని చౌదరి.. బాబీ సింహ.. ఓ డార్క్ కామెడీ
ABN , Publish Date - Nov 09 , 2026 | 10:29 AM
చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో ఓ సరికొత్త సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం తెరకెక్కుతోంది.
చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలో ఓ సరికొత్త సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం తెరకెక్కుతోంది. వికాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ యాష్కీ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టులోకి విలక్షణ నటుడు బాబీ సింహ చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
''సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు డార్క్ కామెడీకి ప్రాధాన్యం ఉంది. కథలోని ఆసక్తికరమైన మలుపులు, వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. బాబీ సింహ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుండటం సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది' అని మేకర్స్ చెప్పారు.
సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. జీవన్ కుమార్, అజయ్ ఘోష్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్, ఇతర వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి:
‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. ఫ్యాన్స్‌లో గందరగోళం
ఫ్లాప్ సినిమాను వందరోజులు ఆడించారు.. ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే..