రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో బ్లాస్ట్ బ్యూటీ?
ABN, Publish Date - Oct 15 , 2026 | 05:23 PM
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న rc17 ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
'పెద్ది' చిత్రం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (sukuma) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ 'RC17'. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో, ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ల గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్గా నటిస్తోందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా మరొక క్రేజీ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. 'ఓం భీమ్ బుష్', 'కన్నప్ప' సినిమాలతో పాటు ఈ ఏడాది 'బ్లాస్ట్' మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ప్రీతి ముకుందన్ ( Preity Mukhundhan). ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇటీవల డైరెక్టర్ సుకుమార్ స్వయంగా ప్రీతికి స్టోరీ చెప్పగా, ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ప్రీతి ముకుందన్.. రామ్ చరణ్ - సుకుమార్ లాంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆమె కెరీర్లో మరో పెద్ద మైలురాయిగా మారనుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా ఈ నెల 20న ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దసరా రోజు కుదరకపోతే, ఆ తర్వాతి రెండు రోజుల్లో ఈ సినిమా లాంచ్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన కొత్త ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలను కూడా మేకర్స్ పూర్తి చేశారు.
ఇక ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక నుంచి టెక్నీషియన్ల సెలక్షన్ వరకు ప్రతి విషయంలోనూ పూర్తిగా దర్శకుడు సుకుమార్‌కే పవర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ విజన్‌పై పూర్తి నమ్మకం ఉంచారట.
ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్‌ని ఎంతో థ్రిల్ చేస్తున్న మరో అంశం మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకు సుకుమార్ సినిమాలన్నింటికీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం సుకుమార్ తన పంథాని మార్చనున్నారట. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారట. దేవి స్థానంలో అనిరుధ్ రావడం వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకి ఏ రేంజ్లో ప్లస్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి, 'రంగస్థలం' కంటే బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని సుకుమార్ ఈసారి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారట. మరి రామ్ చరణ్ - సుకుమార్ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.