విశాఖలో మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్.. లీక్ చేసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:13 PM
ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న సుదర్శన్ థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి భారీ IMAX మల్టీప్లెక్స్ స్క్రీన్‌ను నిర్మిస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తోంది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ (People Media Factory) ఎప్పటికప్పుడు వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర మట్టి నుంచి పుట్టి, తన గానంతో వేలాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఆనంది టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించగా, టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈవెంట్లో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైజాగ్‌లో సినిమా షూటింగ్‌లు, సినిమాటిక్ డెవలప్మెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘మీరు ఏదైనా షూటింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు కచ్చితంగా వైజాగ్‌లో కూడా కొంత పార్ట్ చేయడం కోసం ప్లాన్ చేయండి. మొన్ననే నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన చెప్తూ వచ్చారు.. ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun) వాళ్లు ఆరు స్క్రీన్లతో మల్టీప్లెక్స్ థియేటర్లను అక్కడ పెట్టారు. చిరంజీవి గారు కూడా త్వరలోనే కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా మెగా ప్రొడ్యూసర్స్ కాబట్టి, నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన యాక్టివిటీస్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ‘గరివిడి లక్ష్మి’ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

మెగా ఫ్యామిలీతో గంటా శ్రీనివాసరావు కుటుంబానికి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న సుదర్శన్ థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) భారీ IMAX మల్టీప్లెక్స్ స్క్రీన్‌ను నిర్మిస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సరిగ్గా ఇదే సమయంలో విశాఖపట్నంలోనూ చిరంజీవి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఏర్పాటు చేయబోతున్నారంటూ గంటా అధికారికంగా వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖను సినీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మెగాస్టార్ వేస్తున్న అడుగులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక ‘గరివిడి లక్ష్మి’ విషయానికి వస్తే... ఓ సాధారణ పల్లెటూరి జానపద గాయని స్వరం ఎలా ప్రపంచాన్ని తాకింది, ఆమె జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు ఏంటనేది ‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో హృద్యంగా ఆవిష్కరించారు. ఇప్పటికే టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, ఆనంది నటన సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. అక్టోబర్ 17న థియేటర్లలోకి రానున్న ఈ మట్టి కథ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి!
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..
Soori7: మైత్రీ మూవీ మేకర్స్‌లో సూరి కొత్త ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభం