నవ్విస్తూ, భయపెట్టేందుకు ‘భూతం ప్రేతం’ రెడీ..
ABN, Publish Date - Nov 16 , 2026 | 09:13 PM
వినోదంతో పాటు ఉత్కంఠను పంచే హారర్ కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆ కోవలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు వెన్నులో వణుకు పుట్టించేందుకు ఓ చిత్రం రాబోతోంది.
వినోదంతో పాటు ఉత్కంఠను పంచే హారర్ కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆ కోవలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమవుతున్న సరికొత్త చిత్రం ‘భూతం ప్రేతం’ (Bhootham Praytham). సృజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బి. వెంకటేశ్వరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తున్నారు. బుల్లితెరపై తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్‌తో పాటు బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, గ్లింప్స్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అధికారిక విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే.. సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు, ఆడియన్స్‌ను భయపెట్టే అసలైన హారర్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పోస్టర్లో నటీనటులందరూ ఒక్కొక్కరు ఒక్కో విభిన్నమైన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన పూర్తిస్థాయి వినోదం, సస్పెన్స్ అంశాలు తమ చిత్రంలో ఉన్నాయని ఈ పోస్టర్ ద్వారా చిత్ర బృందం గట్టిగానే హింట్ ఇచ్చింది. విడుదల తేదీ ఖరారు కావడంతో ఇకపై ప్రమోషన్ల జోరు పెంచేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ వంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లతో ప్రేక్షకులను అలరించనున్నారు. డిసెంబర్ 11న థియేటర్లలో నవ్వులు, భయం కలగలిసిన ‘భూతం ప్రేతం’ సందడి ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్
సోల్‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?
యువత ఆలోచనలకు అద్దం పట్టేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ రివ్యూ