యువత ఆలోచనలకు అద్దం పట్టేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ రివ్యూ

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:16 PM

‘ఐ హేట్ మ్యారేజ్’.. పరమేష్ రేణు కుంట్ల దర్శకత్వంలో, ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు.

I Hate Marriage Trailer

సుగి విజయ్ (Sugi Vijay), జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఐ హేట్ మ్యారేజ్’ (I Hate Marriage). పరమేష్ రేణు కుంట్ల దర్శకత్వంలో, ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ.. నేటి యువత ఆలోచనలకు అద్దం పట్టే బోల్డ్ అటెంప్ట్ అనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

ట్రైలర్‌ను గమనిస్తే.. (I Hate Marriage Trailer Review) నేటి తరం (Gen Z) యువత ప్రేమ, పెళ్లి, కెరీర్, రిలేషన్‌షిప్స్ విషయంలో ఎలాంటి ఆలోచనలతో ఉందో ఎలాంటి దాపరికాలు లేకుండా అత్యంత సహజంగా చూపించే ప్రయత్నం ఈ ట్రైలర్‌లో కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో కొందరు యువతీయువకులు వివాహం పట్ల పెంచుకుంటున్న అపోహలు, పెళ్లికి ముందు రిలేషన్స్, ఆ తర్వాత ఎదురయ్యే మానసిక సంఘర్షణలను ట్రైలర్ ప్రారంభం నుంచే బోల్డ్ డైలాగ్స్‌తో ఆసక్తికరంగా ఆవిష్కరించారు.


ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో కన్సల్టెన్సీలు చేసే మోసాలు, ఆర్థిక అవసరాల కోసం లేదా విలాసాల కోసం తప్పుదారి పట్టే యువత జీవితాలు, అలాగే ‘బాయ్‌ఫ్రెండ్‌తో ఎంత పచ్చిగా తిరిగినా సరే, పెళ్లి మాత్రం పేరెంట్స్ చూసిన అబ్బాయితోనే’ అనే నేటి కాలపు మైండ్‌సెట్‌ను కళ్లకు కట్టినట్లు చూపించిన విధానం ఆలోచింపజేస్తుంది. హీరో సుగి విజయ్ తన పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోయారు. తొలి చిత్రమే అయినా జుప్సీ భద్ర (Zupsy Bhadra) భావోద్వేగ సన్నివేశాల్లో చక్కటి అభినయాన్ని కనబరిచారు. వీరితో పాటు హారిక రాజేందర్, సాహితి కృష్ణ, పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.


ఇక ఈ ట్రైలర్‌కు ప్రధాన బలం ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ సి. కుమార్ అందించిన విజువల్స్. హైదరాబాద్ నగర నేపథ్యం, నైట్ ఎఫెక్ట్స్, బ్లాక్ అండ్ వైట్ టోన్ షాట్స్‌ను ఆయన ఎంతో రిచ్‌గా చిత్రీకరించారు. నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. దర్శకుడు పరమేష్ రేణు కుంట్ల ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా నేటి సమాజంలోని వాస్తవ కోణాన్ని టచ్ చేసినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. నేటి యువతకు కావాల్సిన అన్నీ అంశాలు ఇందులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఘనంగా తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థం.. తళుక్కుమన్న స్టార్స్

ఇళయదళపతి విజయ్ బయోపిక్.. హీరో, దర్శకుడు ఫిక్స్ అయినట్టేనా?

‘రామాయణం’ చూసి ఫిదా అయిన అమల!

Updated Date - Nov 16 , 2026 | 06:18 PM

Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది

దివంగత నటుడు శ్రీహరి ఇంట పెళ్లి సందడి

ఇద్దరు హీరోయిన్లతో.. ఆది సాయికుమార్ కొత్త సినిమా 'అరుంధతి నక్షత్రం'

Sai Pallavi: ధ‌నుష్‌.. మీరు విజ‌య్‌ లాగా అస‌లు చేయొద్దు

Ram Gopal Varma: 'రామాయణ' బడ్జెట్‌.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!