సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్‌తో ఆ సినిమా ఇప్పుడు చేస్తే.. 1000 కోట్లు వస్తాయ్: బండ్ల గణేష్

ABN, Publish Date - May 25 , 2026 | 08:47 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌‌ భారీ డిజాస్టర్స్‌లో ఉన్నప్పుడు, ఆయనతో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేశానని అన్నారు బండ్ల గణేష్. నటుడు రాజా రవీంద్ర హోస్ట్‌ చేస్తున్న పాడ్ క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Jr NTR and Bandla Ganesh

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ (Man Of Masses Jr NTR)‌ రెండు భారీ డిజాస్టర్స్‌లో ఉన్నప్పుడు ‘టెంపర్’ (Temper) వంటి సినిమా చేశానని అన్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh). నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra) హోస్ట్‌ చేస్తున్న పాడ్ క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఎన్టీఆర్‌తో చేసిన రెండు సినిమాల గురించి చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, పూరీ కాంబోలో ఆయన నిర్మించిన ‘టెంపర్’ చిత్రం కనుక.. ఇప్పుడు వచ్చి ఉంటే మాత్రం ఈజీగా రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టేదని, అలాంటి కంటెంట్ అందులో ఉందని బండ్ల చెప్పుకొచ్చారు.


ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు రెండు బ్లాక్‌బస్టర్స్ సినిమాలను ఇచ్చాను. ఆయన వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్‌షా’ చేశాను. ‘రామయ్యా వస్తవయ్యా, రభస’ వంటి భారీ డిజాస్టర్ల తర్వాత పూరీతో కలిసి ‘టెంపర్’ సినిమా చేశాను. ‘టెంపర్’ గురించి చెప్పాలంటే.. ఆ కథ వినగానే, కచ్చితంగా మరో ‘గబ్బర్ సింగ్’ సినిమా అవుతుందని పూరీ అన్నారు. ఆయన చెప్పినట్టే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ‘బాద్‌షా’ సినిమా కూడా అప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.


‘బాద్‌షా’ తర్వాత ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’ సినిమాలు చేశారు. అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు నేను ‘టెంపర్’ అనే బ్లాక్ బస్టర్ సినిమా చేశా. వక్కంతం వంశీ ‘టెంపర్’ కథ చెప్పగానే.. ఇది పెద్ద హిట్టు అవుతుందని అనిపించింది. అదే విషయం వంశీకి కూడా చెప్పా. ఇక పూరీ జగన్నాథ్‌కు ఈ కథని పార్క్ హయాత్‌లో వినిపించాం. కథ విని షాకవడమే కాకుండా.. మరో ‘గబ్బర్ సింగ్’ అవుతుందని అన్నారు. నిజంగా, ఆ సినిమా కనుక ఇప్పుడు తీస్తే మాత్రం రూ.1000 కోట్లు ఈజీగా చేస్తుంది. ఎన్టీఆర్ నట విశ్వరూపం ఆ సినిమాలో చూడొచ్చని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ముగిసిన సమావేశం.. ఎగ్జిబిటర్స్ సమస్యలు విని చిరంజీవి ఆశ్చర్యం!

హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

Updated Date - May 25 , 2026 | 08:47 PM