‘పెద్ది’ ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా నటసింహం.. నిజమేనా?
ABN , Publish Date - May 21 , 2026 | 08:28 PM
ఒక హీరో వేడుకకు మరో హీరో గెస్ట్‌గా రావడమనేది చాలా కాలంగా జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ వేడుకలకు కూడా ఇతర స్టార్స్ వస్తున్నారు. ఈ క్రమంలో మెగా హీరో సినిమాకు గెస్ట్‌గా నందమూరి హీరో రాబోతున్నట్లుగా వార్తలు హైలెట్ అవుతున్నాయి.
ఒక హీరో వేడుకకు మరో హీరో గెస్ట్‌గా రావడమనేది చాలా కాలంగా జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ వేడుకలకు కూడా ఇతర స్టార్స్ వస్తున్నారు. నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) సినిమా ఓపెనింగ్‌కు ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) గెస్ట్‌లుగా వెళ్లారు. మహేష్ బాబు సినిమా ఈవెంట్స్‌కు చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారు హాజరైన విషయం కూడా తెలిసిందే. ఇలా టాలీవుడ్‌లో హీరోల మధ్య చాలా మంచి వాతావరణం ఉందని, అనవసరంగా ఫ్యాన్స్ గొడవలు పడవద్దని చెప్పడానికి.. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి స్టార్స్ ఇలా కనిపిస్తూనే ఉన్నారు. ఇక విషయానికి వస్తే.. ఇప్పుడు మెగా హీరో ఫంక్షన్‌కు నందమూరి హీరో గెస్ట్‌గా రాబోతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రాబోతున్న ‘పెద్ది’ (Peddi) సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఈ వేసవికి రాబోయే అతి పెద్ద సినిమా ఇదే కావడంతో.. హీరోలందరి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో జరిగిన ట్రైలర్ లాంఛ్ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భోపాల్‌లో మరో వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఇలా సినిమా రిలీజ్ వరకు దేశవ్యాప్తంగా ఈవెంట్స్ నిర్వహించే ప్లాన్‌లో టీమ్ నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లో భారీగా ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు.
ఈ వేడుకకు వచ్చే గెస్ట్ విషయంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో వార్తలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అవును, ఈ వేడుకకు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నారనేలా ప్రచారం నడుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ‘పెద్ది’ నిర్మాత, ఇప్పుడు బాలయ్య చేస్తున్న ‘NBK111’ చిత్ర నిర్మాత ఒకరే కావడంతో ఈ విధంగా వార్తలు హైలెట్ అవుతున్నాయి. ఈ మధ్య ఒకే బ్యానర్‌లో సినిమాలు చేస్తున్న స్టార్స్.. ఇలానే హాజరవుతున్నారు. ‘పెద్ది’ నిర్మాత వెంకట సతీష్ కిలారు కూడా.. బాలయ్య వచ్చే అవకాశం ఉన్నట్లుగా చిన్న హింట్ కూడా వదిలారు. మరోవైపు రామ్ చరణ్ అంటే బాలకృష్ణకు కూడా చాలా ఇష్టం. ఆ విషయం అనేక సార్లు బాలయ్యే స్వయంగా చెప్పారు. ‘ఆన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ ఈవెంట్‌లో చరణ్‌తో బాలయ్య ఎంత ప్రేమగా ఉన్నారో అంతా చూశారు. చరణ్‌ని సొంత బిడ్డలానే భావిస్తానని బాలయ్య అన్నారు. కాబట్టి, ‘పెద్ది’ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరై, ఆశీస్సులు అందిస్తారనడంలో ఎటువంటి డౌట్స్ అవసరం లేదనేలా.. టాలీవుడ్ అంతా ఒకటే చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయమై మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఇంత వరకు రాలేదు. నిజంగా బాలయ్య వస్తే మాత్రం ‘పెద్ది’ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
ఇవి కూడా చదవండి:
‘లవ్ యూ కళ్యాణ్’.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!
Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!
Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!