బాలయ్యకు విలన్‌గా సీనియర్ హీరో.. నిజమైతే బాక్సాఫీస్ షేకే!
ABN, Publish Date - Jun 07 , 2026 | 09:37 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ (NBK112) రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్‌కు చెందిన మరో సీనియర్ హీరో విలన్‌గా చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ (NBK112) రాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌లో, ఒక వైవిధ్యమైన లుక్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇందులో రాజశేఖర్ పోషించబోయే ప్రతినాయకుడి పాత్ర అత్యంత శక్తివంతంగా, బాలయ్య పాత్రకు గట్టి పోటీ ఇచ్చే విధంగా డిజైన్ చేశారట. ఈ ప్రచారంలో గనుక నిజం ఉంటే, వెండితెరపై ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల మధ్య జరిగే హై-వోల్టేజ్ పోరాటం సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది, అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా కథాంశం గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మాఫియా నేపథ్యంలో సాగుతాయని, ఆ సమయంలో వచ్చే బాలయ్య బాబు పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు కొరటాల శివ తన మార్కును కోల్పోకుండా, బాలకృష్ణను ఒక పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. మాస్ ఎలిమెంట్స్‌తో పాటుగా, కొరటాల శివ సినిమాల్లో ఉండే విధంగానే ఈ కథలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగుతాయని తెలుస్తోంది.
గతంలో వచ్చిన ‘దేవర’ వంటి విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ఆయన ఈ కథపై చాలా కాలం పాటు ప్రత్యేక కసరత్తులు చేసి, ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా మలిచారట. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఆగస్ట్ నెలలోనే ఈ సినిమాను అధికారికంగా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!