Bala Krishna: అప్పుడప్పుడు కాపీ కొడతాం.. అలా ఇచ్చిపుచ్చుకుంటాం..

ABN , Publish Date - Nov 22 , 2025 | 01:07 PM

‘బాలయ్య నటన, సంభాషణలు, పోరాట సన్నివేశాలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి.  ‘అఖండ 2’ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది’ అన్నారు శివరాజ్‌కుమార్‌


‘తమ్ముడు శివరాజ్‌కుమార్‌లోనూ(Shivaraj Kumar), నాలోనూ తండ్రుల రక్తం ప్రవహిస్తోందన్నారు బాలకృష్ణ(NBK). ‘వీరసింహారెడ్డి’ సినిమా కోసం శివరాజ్‌కుమార్‌ నటించిన ‘మఫ్టీ’లోని గెటప్‌ని కాపీ కొట్టాననీ, అలా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం అలవాటేనని బాలయ్య అన్నారు. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: thandavam). సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో... 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. ఈ సందర్భంగా కర్ణాటక, చిక్కబళ్లాపుర జిల్లాలోని చింతామణిలో శుక్రవారం రాత్రి ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక జరిగింది. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు.

శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘బాలయ్య నటన, సంభాషణలు, పోరాట సన్నివేశాలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి.  ‘అఖండ 2’ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది’’ అన్నారు.


బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘
శివతత్వంతో తెరకెక్కిన సినిమా ఇది. శివన్న చేతుల మీదుగా ట్రైలర్‌ ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉంది. దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ధర్మమే త్రిశూలం పట్టుకుని యుద్థానికి దిగినట్టుగా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు.

NBK.jpg

బాలకృష్ణ మాట్లాడుతూ
‘భావితరానికీ, భారతదేశానికీ మహా శక్తి అయిన యువత పెడదారిలో కాకుండా, మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలోనూ ఒక సందేశం ఉంటుంది. అలాంటి ఒక గొప్ప సందేశం ఉన్న సినిమానే ‘అఖండ 2’. మన హైందవ ధర్మం, మన సమాజపు మూలాల్ని, గొప్పతనాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, కన్నడ సినిమా కాదు. పాన్‌ ఇండియా సినిమా.  ఇందులో సనాతన హైందవ ధర్మం గురించి చెప్పాం. ధర్మంగా జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తల వంచకూడదు అన్నదే హైందన ధర్మం. దర్శకుడు బోయపాటి శ్రీనుతో నేను చేస్తున్న నాలుగో సినిమా ఇది. నేను ఏ పాత్ర చేసినా అది నన్ను ఆవహిస్తుంది. దర్శకుడు ప్రతిభ పూర్తిగా ఈ సినిమాతో తెలుస్తుంది. తమన్‌ మరోసారి బాక్సులు బద్దలైపోయేలా సంగీతం అందించారు. ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను ఇదే వేదికపై చేస్తామని అన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 01:07 PM