Koratala Siva: అప్పుడు అబ్బాయ్.. ఇప్పుడు బాబాయ్..సెట్ అయితే ఉంటుంది

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:10 PM

దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కొంతకాలంగా ఖాళీగా ఉండటంతో అతని పని అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

Koratala Siva

Koratala Siva: దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కొంతకాలంగా ఖాళీగా ఉండటంతో అతని పని అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది. దానికి తోడు క్రేజీ ప్రాజెక్ట్ అయిన దేవర 2 (Devara 2) స్టార్ట్ కావాల్సి ఉన్నా, అది ముందుకు సాగకపోవడంతో ఈ ప్రచారానికి మరింత ఊపందుకుంది. కానీ కొరటాల శివ మాత్రం ఖాళీ టైంలోనే తన కెరీర్ కు స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

హిట్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన కొరటాల శివ చాలా సైలెంట్ గా క్రేజీ ప్రాజెక్టుల కోసం కసరత్తు చేస్తున్నారు. 'ఆచార్య' ఫ్లాప్ తర్వాత కొరటాల శివ కాస్తంత తడబడ్డారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'తో మంచి విజయాన్ని అందుకుని, తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చినా కూడా మళ్ళీ ఆయన అడుగులు తడబడ్డాయి. ఈపాటికే 'దేవర 2' సినిమా పట్టాలెక్కించాల్సి ఉండగా.. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ షూటింగ్ తో బిజీగా ఉండటంతో కొరటాల ఖాళీగా ఉండాల్సి వస్తోంది. అయితే ఎన్టీఆర్ ఈ ఏడాదిలోనే 'దేవర 2' షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పినప్పటికీ దానికి చాలానే సమయం ఉందని తెలుస్తోంది. ఇక ఈ టైమ్ ను సద్వినియోగం చేసుకునేందుకు కొరటాల శివ రెడీ అయ్యారట.

'దేవర' సినిమా తర్వాత వచ్చిన గ్యాప్ లో కొరటాల రెండు కొత్త కథలను తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులో ఒక దాన్ని నందమూరి బాలకృష్ణకి నరేట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్!. ఒకవేళ బాలయ్య ఆ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 'దేవర 2' కంటే ముందు దానిని మొదలుపెట్టే ఛాన్స్ ఉందనే వార్త చక్కర్లు కొడుతోంది. బాలయ్యతో పాటు మరో యంగ్ హీరో కోసం కూడా బౌండ్ స్క్రిప్ట్‌ ను కొరటాల రెడీ చేశారట. అయితే దాన్ని ఎవరికి చెప్పాలనేది ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. యంగ్ స్టార్స్ లైనప్, అవైలబిలిటీని బట్టి త్వరలో నరేట్ చేసి ప్రాజెక్ట్ లాక్ చేయాలని కొరటాల అనుకుంటున్నారట. మొత్తానికి పైకి ఖాళీగా కనిపించినా.. కొరటల శివ రెండు మూడు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టుకోవడం ఆయన అభిమానులను ఆనందపరుస్తోంది. ఇప్పటికే అబ్బాయ్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసిన కొరటాల.. ఇప్పుడు బాబాయ్ బాలయ్యతో చేస్తే అదిరిపోతోందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 06 , 2026 | 07:10 PM