Balakrishna: ఇఫీలో బాలయ్యకు.. అరుదైన గౌరవం

ABN , Publish Date - Nov 20 , 2025 | 08:20 PM

నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు మరో అరుదైన గౌరవం దక్కింది.

నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా గురువారం వైభవంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (56th international film festival of india) వేడుకలో బాలయ్యను సన్మానించారు. గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju), కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ బాలకృష్ణను శాలువాతో సత్కరించారు.  నటుడిగా 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాలకృష్ణకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ నట, రాజకీయ జీవితం, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నెలకొల్పడానికి గల కారణాన్ని గుర్తుచేసుకున్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ' సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు అయిందని,  వయసు గురించి అసలు అడగొద్దని  అంటూ నవ్వులు పూయించారు.   నా 50 ఏళ్ళ ప్రయాణంలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు. ఎన్టీఆర్‌- బసవతారకం దంపతులకు జన్మించడం నా అదృష్టం. ఈ జర్నీలో భార్య వసుంధర సపోర్ట్‌ చాలా ఉంది. నట ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది' అని అన్నారు. 

Updated Date - Nov 20 , 2025 | 10:19 PM