సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్యతో కొరటాల! ‘దేవర-2’ పరిస్థితేంటి?

ABN, Publish Date - Apr 24 , 2026 | 09:10 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో సినిమా ఖరారైందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Balakrishna, Koratala Siva and Jr NTR

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు కొరటాల శివ కలయికలో సినిమా ఖరారైందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే వారమే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ క్రేజీ కాంబినేషన్ గురించి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇప్పుడు ఈ అప్డేట్ రావడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానుల్లో మాత్రం ఒక రకమైన ఆందోళన మొదలైంది.


ముఖ్యంగా ‘దేవర 2’ (Devara 2) సినిమా భవిష్యత్తుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. కొరటాల శివ (Koratala Siva) తన తదుపరి చిత్రాన్ని బాలయ్యతో అనౌన్స్ చేయడంతో, ‘దేవర’ సీక్వెల్ హఠాత్తుగా పక్కకు వెళ్ళిపోయిందా? అనే అనుమానం తారక్ (Tarak) అభిమానులను వేధిస్తోంది. ఎందుకంటే, దేవర మొదటి భాగం కేవలం పాత్రల పరిచయానికే పరిమితమైందని, అసలైన కథ, పదింతల ఎలివేషన్లు సీక్వెల్‌లోనే ఉంటాయని గతంలో లీకులు వచ్చాయి. స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం అభిమానులకు మింగుడుపడటం లేదు. మరోవైపు, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (Dragon) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఆశించిన వేగంతో సాగడం లేదు. రకరకాల కారణాల వల్ల చిత్రీకరణకు ఆటంకాలు కలుగుతుండటంతో, ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన మేకర్స్ ఏకంగా విడుదల తేదీని ఏడాది పాటు వాయిదా వేసి, 2027 జూన్ 11కు లాక్ చేశారు. దీనికి తోడు, టోవినో థామస్ తప్పుకున్న పాత్రకు ఇప్పటికీ సరైన ప్రత్యామ్నాయం దొరక్కపోవడం కూడా షూటింగ్ స్పీడ్‌కు అడ్డంకిగా మారింది.


ఇక ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే సలార్, కేజీఎఫ్ తరహాలో కాకుండా, ‘ధురంధర్’ ఫార్ములాతో అంటే.. రెండు భాగాలను సమాంతరంగా చిత్రీకరించి అతి తక్కువ వ్యవధిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, ఎన్టీఆర్ రాబోయే రెండేళ్ల వరకు మరో ప్రాజెక్టుకు డేట్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనివల్ల ‘దేవర’ సీక్వెల్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్యాప్‌లో కొరటాల శివ, బాలయ్య సినిమాను ఆరు నెలల్లోనే పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి లేదా వేసవికి విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆయన ‘దేవర 2’ మీద దృష్టి పెట్టగలరు. కానీ తారక్ నిజంగా ఈ సీక్వెల్ విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నారనేది స్పష్టత లేదు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ‘దేవర 2’ గురించి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు గనుక అప్డేట్ రాకపోతే, ‘దేవర’ సీక్వెల్ మరికొన్ని ఏళ్లు వాయిదా పడినట్లేనని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!

Updated Date - Apr 24 , 2026 | 09:10 PM