బాహుబలికి, భారతీయ సినిమాకు అరుదైన గౌరవం - రాజమౌళి

ABN , Publish Date - Apr 15 , 2026 | 10:21 PM

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో పాటు ‘బాహుబలి’ టీమ్, రెబల్ స్టార్ ప్రభాస్ అందరూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ‘జై మాహిష్మతి’ అంటూ మరోసారి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లారు. వారు అలా చేయడానికి కారణం లేకపోలేదు.

Baahubali The Eternal War

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)తో పాటు ‘బాహుబలి’ (Baahubali) టీమ్, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) అందరూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ‘జై మాహిష్మతి’ అంటూ మరోసారి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లారు. వారు అలా చేయడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా? ‘బాహుబలి’ ఫ్రాంచైజీ‌లో ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ (Baahubali The Eternal War) అనే యానిమేషన్ చిత్రం 2027లో విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ యానిమేషన్ చిత్రం అరుదైన గౌరవాన్ని అందుకుని, మరోసారి ‘బాహుబలి’ని వార్తల్లో ఉండేలా చేసింది. ఆ గౌరవం ఏంటంటే.. ఫ్రాన్స్‌లో జరిగే ప్రతిష్టాత్మక యానిమేషన్ ఫెస్టివల్ ‘ఎన్నేసి’లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ అధికారికంగా ఎంపికైంది. ఈ మేరకు సదరు ఫెస్టివల్ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజమౌళి, ప్రభాస్ వంటి వారంతా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని తెలియజేశారు.


‘‘యానిమేషన్ అనేది హద్దులు లేని ఒక అద్భుతమైన వేదిక అని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. ఇది బాహుబలికి, భారతీయ సినిమాకు దక్కిన ఒక అరుదైన గౌరవం. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ యానిమేషన్ చిత్రం ‘ఎన్నేసి’ (Annecy) 2026 ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ లైనప్‌లో ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ యానిమేషన్ వేదికపై ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి శోభు, ఈషాన్ శుక్లా మొత్తం బృందం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను!’’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.


‘‘బాహుబలి: ది ఎటర్నల్ వార్.. చిత్రం ఫ్రాన్స్‌లో జరగనున్న ‘ఎన్నేసి’ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ ప్రదర్శన కోసం ఎంపికైందని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బాహుబలి ప్రపంచం ఇటువంటి భారీ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌పై గుర్తింపు పొందడం అద్భుతంగా ఉంది. శోబు, ఈషాన్ శుక్లాతో పాటు టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు.. జై మాహిష్మతి!’’ అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు.

‘‘బాహుబలి వారసత్వంలో తదుపరి అధ్యాయం, #BaahubaliTheEternalWar, ప్రతిష్టాత్మకమైన ‘ఎన్నేసి’ (Annecy) ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ లైనప్‌లోకి అధికారికంగా ఎంపికైందని తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము! ‘ఎన్నేసి’, త్వరలోనే కలుద్దాం! జై మాహిష్మతి!’’ అని ‘బాహుబలి’ నిర్మాతలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్‌ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!

జూన్‌లోనే ‘పెద్ది’.. అధికారిక ప్రకటన వచ్చేసింది

మొన్న చరణ్.. ఇప్పుడు వరుణ్.. ‘బరి’ ప్రాక్టీస్‌ సెషన్‌లో ప్రమాదం

Updated Date - Apr 15 , 2026 | 10:21 PM

Baahubali - The Epic: తాయిలాలతో తృప్తి పడమంటున్న అడివి శేష్‌

Baahubali Team: బాహుబలి మళ్లీ వస్తున్నాడు

Baahubali: Crown of Blood: ఆ ఆలోచనతోనే యానిమేటెడ్‌ సిరీస్‌ చేశాం!

Baahubali The Epic Teaser: బాహుబలి ది ఎపిక్ టీజర్ పై ఫ్యాన్స్ ఫైర్

Baahubali’s Eternal War: 2027లో యానిమేటెడ్ బాహుబలి