Baahubali: Crown of Blood: ఆ ఆలోచనతోనే యానిమేటెడ్‌ సిరీస్‌ చేశాం!

ABN , Publish Date - May 11 , 2024 | 03:59 PM

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి (Bahubali) చిత్రం ఇప్పుడు యానిమేటెడ్‌ సిరీస్‌గా ఓటీటీలో  స్ట్రీమింగ్ కానుంది. మే 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Baahubali: Crown of Blood: ఆ ఆలోచనతోనే యానిమేటెడ్‌ సిరీస్‌ చేశాం!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి (Bahubali) చిత్రం ఇప్పుడు యానిమేటెడ్‌ సిరీస్‌గా ఓటీటీలో  స్ట్రీమింగ్ కానుంది. మే 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసి సందేశం ఇచ్చారు.

‘బాహుబలి (Baahubali: Crown of Blood) సిరీస్‌ను కంటిన్యూ చేయమని ఎంతోమంది అభిమానులు అడిగారు. వారందరి కోసం ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ని  రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌కు పనిచేసిన గ్రాఫిక్‌ ఇండియాతో కలిసి దీన్ని రూపొందించాం. 9 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ మీ ముందుకు వస్తోంది. అందరూ చూసి ఎంజాయ్‌ చేయండి.  మీ అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. ఈ సిరీస్‌ తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన సమావేశంలో రాజమౌళి ఈ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ‘బాహుబలిని థియేటర్‌లో దాదాపు 10 కోట్ల మంది మాత్రమే చూశారు. మిగతా వాళ్లు టెలివిజన్‌, ఓటీటీలో చూసి ఉంటారు. ప్రతి ఒక్కరూ సినిమాలో ఏదో ఒక మాధ్యమం ద్వారా చూస్తారు. అందరూ రెగ్యులర్‌ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్‌ మూవీలను మాత్రమే ఆస్వాదించే వాళ్లూ ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి యానిమేటెడ్‌ సిరీస్‌ను తీసుకొస్తున్నాం’ అని అన్నారు.

ప్రస్తుతం ఆయన సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుతో ఎస్‌ఎస్‌ఎంబీ29 చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రంలో మహేశ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని టాక్‌. ఇప్పటికే రాజమౌళి పలు ఫొటోషూట్స్‌ నిర్వహించారు. మహేశ కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల దుబాయ్‌లో స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేసి వచ్చారు.

Read More: Tollywood, Cinema News

Updated Date - May 11 , 2024 | 04:17 PM