‘అరేయ్ ఆపండ్రా’.. మే 15న చూసుకుందాం!
ABN, Publish Date - Apr 20 , 2026 | 04:21 PM
‘అరేయ్ ఆపండ్రా’.. మే 15న చూసుకుందాం! అనగానే ఇదేదో గొడవ అనుకుంటారేమో? అలాంటిదేమీ లేదు. ‘అరేయ్ ఆపండ్రా’.. అనేది సినిమా పేరు.
‘అరేయ్ ఆపండ్రా’.. మే 15న చూసుకుందాం! అనగానే ఇదేదో గొడవ అనుకుంటారేమో? అలాంటిదేమీ లేదు. ‘అరేయ్ ఆపండ్రా’ (Arey Apandra).. అనేది సినిమా పేరు. క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ బ్యానర్‌పై అశోక్ నిమ్మల నిర్మాతగా, తల్లాడ సాయి కృష్ణ (Thallada Sai Krishna) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కామెడీ సస్పెన్స్ చిత్రం ‘అరేయ్ ఆపండ్రా’. వెంకట్ దుగ్గిరెడ్డి, అంజాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మే 15న (Arey Apandra Release Date) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. చిత్ర బృందం తమ ఆనందాన్ని మీడియాతో పంచుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ.. ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన కామెడీ సినిమాని మా బ్యానర్ ద్వారా అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాని మా డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు. సుదర్శన్, భద్రం, తల్లాడ సాయికృష్ణ నటనకు అంతా ఫిదా అవుతారని తెలిపారు. సహ నిర్మాతలు వెంకట్ దుగ్గిరెడ్డి, అంజాద్ మాట్లాడుతూ.. ఇటువంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమాను షూట్ చేశాం. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని కేవలం ఇక్కడే కాకుండా.. అమెరికాలో సైతం ఘనంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
దర్శకుడు, నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. వాస్తవికతకు దగ్గరకు ఉంటూ.. నేటి సమాజంలో ఉన్న పరిస్థితులను న్యాచురల్ కామెడీతో చూపిస్తూనే, ఒక మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నాం. మే 15న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వినోద్ నువ్వుల, కిశోర్ దాస్, వంటి వారు మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అందుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!
సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!
SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!
Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!