సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘భోగి’ ప్రమోషన్స్‌.. డింపుల్ కోసమే అనుపమని పక్కన పెట్టారా?

ABN, Publish Date - Nov 25 , 2026 | 12:19 PM

‘భోగి’ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటించిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించకపోవడం.. అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

No Anupama Parameswaran at Bhogi Promotions

టాలీవుడ్‌లో ఇప్పుడు ‘భోగి’ (Bhogi) సినిమా ప్రమోషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటించిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), ఇప్పటివరకు జరిగిన ‘భోగి’ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించకపోవడం అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఈ సినిమాకు లీడ్ హీరోయిన్ అనుపమ అయినప్పటికీ, కనీసం ఒక్క ఈవెంట్‌కు కూడా చిత్ర బృందం ఆమెను ఆహ్వానించలేదని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలపై ఫిలింనగర్ సర్కిల్స్‌లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ చిత్రంలో డింపుల్ హయాతి (Dimple Hayathi)ని కేవలం ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కోసమే తీసుకున్నారని, కానీ షూటింగ్ మొదలైన తర్వాత స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేశారని తెలుస్తోంది. కావాలనే డింపుల్ హయాతి పాత్రను హైలైట్ చేయడం కోసమే ‘భోగి’ టీమ్ ఇదంతా ప్లాన్ చేస్తోందని, అందుకే అనుపమను ఉద్దేశపూర్వకంగానే ప్రమోషన్లకు దూరం పెడుతున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఈవెంట్స్‌లో డింపుల్‌కు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే.. అది నిజమే అని అనిపించకమానదు.


మరోవైపు, సినిమా ప్రారంభంలో అనుపమకు చెప్పిన కథకు, తెరకెక్కించిన ఫైనల్ అవుట్‌పుట్‌కు చాలా మార్పులు జరిగాయని, తన పాత్రకు ప్రాధాన్యత తగ్గించారన్న అసంతృప్తితోనే ఆమె కూడా ఈ సినిమాకు దూరంగా ఉంటోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి బలం చేకూరుస్తూ.. ‘భోగి’ సినిమాకు సంబంధించిన టీజర్ గానీ, ట్రైలర్ గానీ, కనీసం ఒక్క పాటను గానీ అనుపమ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయకపోవడం గమనార్హం. తను నటించిన సినిమాల అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే అనుపమ.. ఈ సినిమా విషయంలో మాత్రం ఎందుకు అలా చేస్తుంది? ఆమె హర్ట్ అయింది కాబట్టే.. ఇలా ప్రవర్తిస్తుందని, అందుకే ప్రమోషన్స్‌కు కూడా రావడం లేదనేలా టాక్ వినిపిస్తోంది.


తెలుగు ప్రేక్షకుల్లో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్, మార్కెట్ ఉన్నాయి. అలాంటి హీరోయిన్‌ను రాబోయే ఈవెంట్స్‌లోనైనా ప్రమోషన్లకు తీసుకొస్తారో లేదో చూడాలి. ఒకవేళ ‘భోగి’ టీమ్ అనుపమను ప్రమోషన్లకు ఆహ్వానించకపోతే, సినిమా బజ్ విషయంలో మేకర్స్ భారీగా నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందులోనూ శర్వా, అనుపమ హిట్ పెయిర్. అలాంటిది ఆమెను కాదని చిత్రబృందం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది?.. ఇలా రకరకాలుగా ‘భోగి’ విషయంలో అనుపమకు సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. మరి వీటికి యూనిట్ కానీ, లేదంటే అనుపమ కానీ ఏమైనా సమాధానం ఇస్తారేమో చూడాలి. శర్వా హీరోగా సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర మొదటి వర్ధంతి.. హేమమాలిని ఎమోషనల్ పోస్ట్

‘ఐ హేట్ మ్యారేజ్’ కేవలం బోల్డ్ సినిమా కాదు.. దర్శకుడు ఏం చెప్పారంటే

‘రామాయణ’ రికార్డ్ అవుట్.. రిలీజ్‌కు ముందే ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ సంచలనం

Updated Date - Nov 25 , 2026 | 12:19 PM