‘రామాయణ’ రికార్డ్ అవుట్.. రిలీజ్‌కు ముందే ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ సంచలనం

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:13 AM

భారతీయ బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సూపర్ హీరోల మేనియా మరోసారి సునామీలా విరుచుకుపడుతోంది. గ్లోబల్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ థియేటర్లలోకి రాకముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.

Avengers Doomsday Record

భారతీయ బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సూపర్ హీరోల మేనియా మరోసారి సునామీలా విరుచుకుపడుతోంది. గ్లోబల్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ (Avengers: Doomsday) థియేటర్లలోకి రాకముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం, ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 17న భారతదేశంలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా విడుదలకు ఇంకా 23 రోజుల సమయం ఉండగానే, ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా రూ.50 కోట్ల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


నవంబర్ 17న భారత్‌లో ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ అడ్వాన్స్ బుకింగ్స్ తెరుచుకోగా, కేవలం వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇందులో కేవలం మొదటి రోజు (ఓపెనింగ్ డే) ప్రీ-సేల్స్ నుంచే దాదాపు రూ.22 కోట్లు వసూలు కావడం విశేషం. గత ఐదు రోజుల్లోనే అదనంగా రూ.20 కోట్ల మేర టికెట్లు అమ్ముడవడంతో, ఈ చిత్రం ఇండియాలో ఆల్-టైమ్ హాలీవుడ్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

సాధారణంగా మన దేశంలో భారీ భారతీయ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. కానీ ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ వేగం ముందు మన ఇండియన్ బ్లాక్‌బస్టర్స్ రికార్డులు సైతం వెనకబడిపోయాయి. బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాలు ‘రామాయణ’ (Ramayana), ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) వంటి భారీ సినిమాలు తమ విడుదలకు చివరి వారంలో మాత్రమే రూ.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మార్కును చేరుకున్నాయి. కానీ ‘డూమ్స్‌డే’ మాత్రం రిలీజ్‌కు మూడు వారాల ముందే.. ఆ మైలురాయిని దాటేసి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.


ప్రేక్షకుల నుంచి వస్తున్న అనూహ్య స్పందన, టికెట్ల కోసం నెలకొన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా దేశంలోని ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విడుదల రోజున (డిసెంబర్ 17) అర్ధరాత్రి షోలు బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో రద్దీని తట్టుకునేందుకు పలు ప్రధాన నగరాల్లో 24 గంటల పాటు షోలు వేసేందుకు థియేటర్ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ‘అవెంజర్స్ : ఎండ్‌గేమ్’ (2019) తర్వాత రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్ ‘డాక్టర్ డూమ్’గా ఎంట్రీ ఇస్తుండటం సినిమాపై హైప్‌ను ఆకాశానికి చేర్చింది. మరి మరో మూడు వారాల సమయం ఉండటంతో, ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ ఫైనల్ ప్రీ-సేల్స్ విషయంలో ఇండియాలో ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

ఇవి కూడా చదవండి:

తరుణ్ భాస్కర్‌లో ఇంతటి ఆవేశానికి కారణమేంటి?

శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. నెట్టింట క్రేజీ పిక్ వైరల్

‘నాన్న కుట్టి’ ఫస్ట్ హాఫ్ బేస్‌.. సెకండాఫ్ ఎమోషన్: విజయ్ ఆంటోని

Updated Date - Nov 25 , 2026 | 10:13 AM

Avengers Doomsday: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ‘అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్‌కు ముందే భారీ హైప్!

Avengers Doomsday: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’.. కొత్త టీజర్

Avengers Doomsday: ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’ ఫైనల్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Avengers Endgame: 'అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ మళ్లీ థియేటర్లలోకి..

Marvel Studios: క్వాంటమ్ కొత్త సామ్రాజ్యాన్ని వీక్షించేందుకు సిద్ధమా..