సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: 'రాకా'లో నాలుగు పాత్రల్లో

ABN, Publish Date - Jul 14 , 2026 | 10:57 AM

నాటి మేటి నటులు అనేకమంది తెరపై బహుపాత్రల్లో అలరించారు... అదే రూటులో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం సాగనున్నారని టాక్. రాబోయే 'రాకా' మూవీలో బన్నీ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

Allu Arjun

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాకా' వైపు సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బన్నీ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని విశేషంగా వినిపిస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రల్లో అల్లు అర్జున్ నటిస్తున్నారట. ఇప్పటి దాకా ద్విపాత్రాభినయమే చేయని అల్లు అర్జున్ ఒకేసారి నాలుగు పాత్రల్లో నటిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. దర్శకుడు అట్లీ తన 'మెర్సల్' సినిమాలో హీరో విజయ్ తో త్రిపాత్రాభినయం చేయించారు. ఇందులో ఓ తండ్రి, ఇద్దరు కొడుకులుగా విజయ్ నటించారు. ఇక షారుఖ్ ఖాన్ తో అట్లీ తెరకెక్కించిన 'జవాన్'లోనూ హీరో ద్విపాత్రాభినయం చేశారు. ఇలా తన కథానాయకులతో విభిన్న పాత్రలు పోషింప చేయడంలో మేటి అనిపించుకున్నారు అట్లీ. అదే తీరున 'రాకా'లోనూ కథానుగుణంగా తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలు ఉన్నాయి.. వాటిలో అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేశారని టాక్.


ఆ జాబితాలో అల్లు అర్జున్...

వాస్తవానికి 'రాకా'లోని తాత, తండ్రి పాత్రలను వేరే నటులతో పోషింప చేయాలని ముందుగా అట్లీ భావించారట. అయితే ఆ పాత్రల్లోని వైవిధ్యం అల్లు అర్జున్ ను ఆకర్షించిందట. అందువల్ల ఆ రెండు పాత్రలనూ తానే ధరిస్తానని బన్నీ చెప్పడంతో వెంటనే ఆయనపై టెస్ట్ కట్ చేశారట. తాను ఊహించిన దానికంటే మిన్నగా బన్నీ ఆ పాత్రల్లో కనిపించడంతో అట్లీ కూడా మరోమాట లేకుండా ఓకే చేశారట. అలా 'రాకా'లో నాలుగు పాత్రల్లో బన్నీ కనిపించనున్నారు. గతంలో బహుపాత్రల్లో నటించి ఆకట్టుకున్నవారిలో యన్టీఆర్, శివాజీగణేశన్, ఏయన్నార్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటివారు ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా 'రాకా'లో నాలుగు పాత్రలతో ప్రేక్షకులను రంజింప చేస్తే ఆ మహానటుల జాబితాలో చోటు సంపాదిస్తారన్న మాట.


'రాకా' చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోంది. అందువల్ల వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీగా రూపొందుతోన్న 'రాకా'లో దీపికా పడుకోణె నాయికగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రశ్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఫెమినా జార్జ్ వంటివారు కూడా కనిపిస్తారని సమాచారం. ఇంతమంది అందాల భామలు, అల్లు అర్జున్ నాలుగు పాత్రలు- 'రాకా' సినిమాకు బిగ్ ఎస్సెట్ అని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు ఏ తీరున ప్రేక్షకుల ముందుకు వస్తుందో కానీ, ఎప్పుడొచ్చినా ఇందులో ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. రాబోయే రోజుల్లో 'రాకా' ఇంకా ఎన్ని విశేషాలను మన ముందు ఉంచుతుందో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్

Mysskin: విజయ్‌ సేతుపతి ఒక అగ్నిపర్వతం 

Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది

Indian Movies: ఆ చిత్రాల్లో అగ్రస్థానంలో 'టాక్సిక్‌'!

Updated Date - Jul 14 , 2026 | 11:04 AM